Breaking News

ఓటీటీలోకి గుండెల్ని పిండేసే లవ్‌స్టోరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published on Sun, 07/26/2026 - 11:42

టాలీవుడ్‌ యంగ్‌ హీరో హర్షిత్ రెడ్డి నటించిన తాజా చిత్రం ‘దీవాన’. ఈ చిత్రంలోన బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ స్మేహ మణిమేఘలై తెలుగు తెరకు పరిచయం అయింది. శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవీ కార్యంపూడి నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్‌ 20న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్‌ని అందుకుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. అంతగా ఆకట్టుకున్న ఈ ప్రేమ కథ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

ఈ జులై 31వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. 'మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్' అంటూ మేకర్స్ ఈ రోజు ‘దీవాన’ ఓటీటీ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే ఎర్లీ యాక్సెస్ లో ఈ సినిమాను చూడొచ్చు. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా వ్యూయర్స్ కు అందుబాటులో ఉండనుంది.

‘దీవాన’ కథేంటంటే.. 
డిగ్రీ పూర్తి చేసిన మున్నా (హర్షిత్ రెడ్డిద) ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడం, తాగడం తప్పా ఇంటి బాధ్యతల్ని పట్టించుకోడు. తండ్రి శేఖర్(నరేష్) పడే కష్టం గురించి మున్నా ఏ మాత్రం ఆలోచించడు. అసలు తల్లిదండ్రులు, ఇంటి బాధ్యత అన్నదే మున్నాకి పట్టదు. ఎప్పుడూ గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటాడు. అలాంటి మున్నా ఓ సారి ఓ అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇక ఆ అమ్మాయి మీ సేవా కేంద్రంలో పని చేస్తుంటుందని, ఆమె పేరు అమూల్య (స్మేహా మణిమేఘలై) అని తెలుసుకుంటాడు. 

ఇక ప్రతీ రోజూ మీ సేవాలో ఏదో ఒక పని అడ్డం పెట్టుకుని అమూల్య వద్దకు వెళ్లడం చేస్తుంటాడు మున్నా. అయితే కొన్ని రోజులకు మున్నా చేష్టలకు అమూల్య విసిగిపోతుంది. నేను నెలకి రూ. 20 వేలు సంపాదిస్తున్నా.. నువ్వు మాత్రం రూ. 20  కూడా సంపాదించలేవు.. ముందు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని కనపడు.. ఆ తరువాత చూద్దాం అని మున్నాతో అమూల్య చెబుతుంది. దీంతో మున్నా ఓ గాడిన పడతాడు. అమూల్య చెప్పినట్టుగా జాబ్ సంపాదించుకునే క్రమంలో ప్రయత్నాలు మొదలు పెడతాడు. అసలు అమూల్య అలాంటి ఓ కండీషన్ ఎందుకు పెట్టింది? మరి మున్నా చివరకు తన ప్రయత్నంలో సఫలం అవుతాడా? వీరి ప్రేమ కథకు అడ్డుగా నిలిచే ఆ కారణాలు ఏంటి? చివరకు మున్నా ప్రేమ గెలుస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)