Breaking News

నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె

Published on Thu, 05/08/2025 - 11:25

బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌లో జంట రణ్‌వీర్‌ సింగ్‌-  దీపికా పదుకొణె ఒకటి. 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. దాదాపు ఆరేళ్ల తర్వాత 2024లో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లలను కనడానికి ఇంత గ్యాప్‌ తీసుకోవడం తన నిర్ణయమే అంటోంది దీపికా. ఈ విషయంలో రణ్‌వీర్‌ సింగ్‌ తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాడని చెప్పింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రెగ్నెన్సీ విషయంలో రణ్‌వీర్‌ ఎంత క్లారిటీగా ఉన్నారనే విషయాన్ని చెబుతూ భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. 

‘పెళ్లయిన కొత్తలో ఓ సారి పిల్లలను కనడం గురించి రణ్‌వీర్‌తో మాట్లాడుతూ..ఎప్పుడు ప్లాన్‌ చేద్దాం అని అడిగాను. దానికి ఆయన సమాధానం ఇస్తూ..‘పిల్లలను కనడం ఇద్దరి నిర్ణయం అయినప్పటికీ.. మోయాల్సింది నువ్వు మాత్రమే. నీ శరీరంలోనే బేబీ పెరుగుతుంది. కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకోవాలి. పిల్లలను కనగలను అని నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్లాన్‌ చేద్దాం’ అన్నారు. ఆయన మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి’ అని దీపికా చెప్పుకొచ్చిది. 

ఇక తన కూతురుకి దువా అనే ఎందుకు పెట్టారో వివరిస్తూ.. ‘బేబీకి పెరు పెట్టే విషయంలో మేం తొందరపడలేదు. బిడ్డ పుట్టిన రెండు నెలల తర్వాత పేరు పెట్టాం. ముందుగా బేబీ క్షేమంగా మా చేతుల్లోకి రావాలనే కోరుకున్నాం.దువా అనే పేరు కూడా అనుకోకుండా పెట్టేశాం. ఓ రోజు రాత్రి సెట్‌లో ఉన్న రణ్‌వీర్‌కి మెసేజ్‌ చేశాను. బేబీ పేరు గురించి చర్చిస్తూ ‘దువా’ అన్నాను. వెంటనే ఓకే చెప్పేశాడు. అదే పేరును మేం ప్రకటించాం. అరబిక్‌ భాషలో దువా అంటే ప్రార్థన అని అర్థం.  మా ప్రార్థనలకు సమాధానమే ఈ పాప అని అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టేశాం’అని దీపికా చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ తీసుకొని పూర్తి సమయం బేబీకి కేటాయించింది. కల్కి 2లో నటించబోతుంది. అలాగే షారుఖ్‌ ఖాన్‌ కొత్త సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)