Breaking News

నా నిర్ణయానికి కారణం ఇదే.. ఇదొక పాఠం : దీపికా పదుకొణె

Published on Sat, 09/20/2025 - 09:22

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె రెండురోజుల నుంచి  సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. దీనికి కారణం ఆమె 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లో నటించకపోవడమేనని చెప్పవచ్చు. కల్కి సీక్వెల్‌లో దీపిక భాగం కావడం లేదని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన తర్వాత పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ వార్త వైరల్‌ అయిపోయింది.  దీపికా పదుకొణె ఏ కారణంతో నటించడం లేదో తెలియనప్పటికీ,  సామాజిక మాధ్యమాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అయితే, తాజాగా దీపికా తన కొత్త సినిమా గురించి ఒక పోస్ట్‌ చేశారు.

దీపికా పదుకొణె, షారుక్‌ ఖాన్‌ ఆరోసారి జంటగా మరో సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటిస్తూ  ఇలా ఒక పోస్ట్‌ చేశారు.  '18 సంవత్సరాల క్రితం 'ఓం శాంతి ఓం సినిమా' చేస్తున్నప్పుడు ఆయన (షారుక్‌ ఖాన్‌) నాకు మొదటి పాఠం నేర్పారు.  ఒక సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం.. ఎవరితో కలిసి పనిచేస్తున్నామనే విషయాలే ఉన్నాయి. ఒక సినిమా విజయం కంటే ఎంతో ముఖ్యమైన విషయాలను చెప్పారు. ఆ మాటలనే ఇప్పటికీ నమ్ముతాను. ఆ రోజు నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆ పాఠాన్నే అమలుచేస్తున్నాను. అందుకే మేము మళ్ళీ కలిసి  6వ సినిమా చేస్తున్నాము.'  అని తెలిపారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్‌ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారనే విషయం తెలిసిందే.

కల్కి సినిమా నుంచి ఆమెను తప్పించిన తర్వాత ఈ పోస్ట్‌ చేయడంతో నెట్టింట వైరల్‌ అవుతుంది. కల్కిలో దీపికా పదుకొణె పర్‌ఫార్మెన్స్ చాలా బాగుందని గతంలోనే తెలుగు అభిమానులు కూడా చెప్పుకొచ్చారు. తన క్యారెక్టర్‌లో ఆమె లీనమై నటించారని ప్రశంసించారు. ఇప్పుడు ఆమె పాత్రలో మరొకర్ని ఊహించుకోవడం కష్టమని  సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు.  ఇప్పుడు ఆమె పాత్రను రీప్లేస్‌ చేసే సత్తా ఉన్న నటి ఎవరనేది పెద్ద చర్చగా కొనసాగుతుంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)