మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె..
Published on Tue, 06/14/2022 - 15:33
Deepika Padukone Admit In Kamineni Hospital In Hyderabad: ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాష్ పదుకొణె కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది బ్యూటిఫుల్ దీపికా పదుకొణె. తనదైన అందం, నటనతో అనేక అభిమానులను సంపాదించుకుంది. డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ బీటౌన్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది దీపికా పదుకొణె.
ఇదిలా ఉంటే తాజాగా దీపికా పదుకొణె ఆస్పత్రిలో చేరింది. హార్ట్‌బీట్ పెరగడంతో హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రుస్తుతం ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నట్లు సమాచారం. కాగా దీపికా పదుకొణె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతేకాకుండా షారుక్ ఖాన్‌తో 'పఠాన్' మూవీ చేస్తున్న దీపికా హాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
చదవండి: ఓటీటీలతో సినీ ఇండస్ట్రీకి ముప్పుపై దీపికా సమాధానం..
రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్..
డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్..
Tags : 1