నన్ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు: యశ్‌ తల్లిపై హీరోయిన్‌ ఫైర్‌

Published on Fri, 08/29/2025 - 18:00

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ (Yash), హీరోయిన్‌ దీపికా దాస్‌ వరుసకు కజిన్స్‌ అవుతారు. కానీ, ఎక్కడా తమ చుట్టరికాన్ని బయటకు చెప్పకుండా ఎవరి కెరీర్‌ వారే నిర్మించుకున్నారు. అయితే యశ్‌ తల్లి పుష్ప ఇటీవల నిర్మాతగా మారి కొత్తలవాడి సినిమా తీసింది. ఆగస్టు 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిరాశపర్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో పుష్ప.. దీపికా దాస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

ఆమె గురించి ఎందుకు?
నెక్స్ట్‌ సినిమాలో దీపికా దాస్‌ను ఎంపిక చేసుకునే ఆలోచనలున్నాయా? అన్న యాంకర్‌ ప్రశ్నపై పుష్ప అసహనం వ్యక్తం చేసింది. అస్తమానూ ఆమె గురించే ఎందుకు అడుగుతారు? రమ్య రక్షిత.. ఇలా ఇండస్ట్రీలో వేరే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. దీపిక పెద్ద స్టార్‌ హీరోయినా? ఆమె ఏం సాధించిందని తన గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు? అని మండిపడింది. ఆమె వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో ట్రోల్‌ జరిగింది.

గౌరవం ఇవ్వడం నేర్చుకోండి
రెండు కుటుంబాల మధ్య సఖ్యత లేదా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తాజాగా ఈ వివాదంపై దీపికా దాస్‌ స్పందించింది. కొత్తగా ఇండస్ట్రీకి కొత్త ఆర్టిస్టులకు పరిచయం చేయాలనుకునేవారు, ముందుగా ఆ ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. సినీ ఇండస్ట్రీలో నాకంటూ గుర్తింపు సంపాదించుకునేందుకు ఎవరి పేరు కూడా వాడుకోలేదు. అవతల ఉన్నది అమ్మ అయినా పుష్పమ్మ అయినా సరే.. నా గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.

అందుకే మౌనంగా ఉన్నా
ఏదో వారిపట్ల గౌరవంతో ఇంతవరకు సైలెంట్‌గా ఉన్నాను తప్ప భయంతో కాదు! నేను పెద్దగా ఏదీ సాధించలేకపోవచ్చు. అంత మాత్రాన నాగురించి నోటికొచ్చినట్లు మాట్లాడతారా? కనీస గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అని ఘాటుగా రియాక్ట్‌ అయింది. నాగిని సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దీపికా దాస్‌ కన్నడ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొంది. పలు సినిమాల్లో కథానాయికగా నటించింది.

చదవండి: ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు.. ఆమెకు చాలా డబ్బిచ్చా..: సన్నీలియోన్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)