Breaking News

'నిప్పు' హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా?

Published on Thu, 07/21/2022 - 17:22

దీక్షా సేత్‌.. ఈ పేరు చెప్తే గుర్తుపడతారో లేదో కానీ వేదం, నిప్పు, మిరపకాయ్‌, వాంటెడ్‌ సినిమాల హీరోయిన్‌ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టిందీ బ్యూటీ. హైదరాబాద్‌లో ఓ మోడలింగ్‌ అసైన్‌మెంట్‌ కోసం పని చేస్తున్న సమయంలో డైరెక్టర్‌ క్రిష్‌ కంట పడింది దీక్ష. వెంటనే ఆమెను వేదం సినిమాలో కేబుల్‌ రాజు(అల్లు అర్జున్‌) గర్ల్‌ఫ్రెండ్‌ రోల్‌ కోసం తీసుకున్నారు. ఆ సినిమా క్లిక్‌ అవ్వడంతో వెంటనే ఆమె మరో రెండు సినిమాలకు సంతకం చేసింది.  అందులో మిరపకాయ్‌ బాక్సాఫీస్‌ దగ్గర బాగానే ఆడింది, కానీ అందులో దీక్షా సేత్‌ సైడ్‌ హీరోయిన్‌. ఇక గోపీచంద్‌తో చేసిన వాంటెడ్‌లో తొలిసారి కథానాయికగా నటించింది.

కానీ ఆమె అంచనాలు తలకిందులు చేస్తూ వాంటెడ్‌ పెద్ద ఫెయిల్యూర్‌గా నిలిచిపోయింది. అలా ఆమె హీరోయిన్‌గా చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె నెమ్మదిగా టాలీవుడ్‌కు దూరమైపోయింది. ఆమె చివరగా తెలుగులో రెబల్‌(2012)లో, హిందీలో సాత్‌ కడమ్‌ (2016)లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయిన ఈ హీరోయిన్‌ సోషల్‌ మీడియాకు కూడా నెలల తరబడి దూరంగా ఉండేది. అప్పుడప్పుడు మాత్రమే తన ఫొటోలను పంచుకునేది. ఈ క్రమంలో దీక్ష తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తోందీ హీరోయిన్‌. ఈ పోస్ట్‌ చూసిన సందీప్‌ కిషన్‌ 'సేత్‌ మళ్లీ వచ్చేసిందోచ్‌' అంటూ కామెంట్‌ చేశాడు. కొందరు మాత్రం దీక్ష ఇలా అయిపోయిదేంటని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుండు అంటున్నారు ఫ్యాన్స్‌.

చదవండి: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో!
ఆ సినిమా కోసం నాలుగేళ్లుగా గెడ్డం తీయలేదు : శరత్‌ కుమార్‌

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)