Breaking News

2 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న గురక సినిమా

Published on Fri, 04/26/2024 - 09:15

మరో డబ్బింగ్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. మొన్నే రిలీజైన ఈ మూవీ.. సరిగ్గా రెండు వారాలు తిరగకుండానే అందుబాటులోకి రానుంది. ఇదే ఇక్కడ షాకింగ్‌గా అనిపిస్తుంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చూసిన ప్రేక్షకులు.. ఇంత మాత్రం దానికి థియేటర్లలో రిలీజ్ ఎందుకు చేశారని గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఇదే మూవీ? ఏ ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందనేది చూద్దాం.

తమిళంలో గతేడాది రిలీజైన సినిమా 'గుడ్ నైట్'. గురక వల్ల కొత్తగా పెళ్లయిన జంట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. ఓటీటీలో డబ్బింగ్ వెర్షన్ కూడా తెలుగులో హిట్ అయింది. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తో తీసిన మరో తమిళ సినిమా 'డియర్'.

ఏప్రిల్ 11న 'డియర్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. దాదాపుగా 'గుడ్ నైట్' కథతోనే తీశారు. దానికి తోడు కనీసం ఎంటర్‌టైన్ చేసే సీన్స్ లేకపోవడం పెద్ద మైనస్ అయింది. దీంతో సినిమా ఫట్ అయింది. వారం తిరక్కుండానే థియేటర్ల నుంచి మాయమైంది. మరోవైపు ఏప్రిల్ 28 అంటే ఈ ఆదివారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అని ప్రకటించేశారు. దీంతో మరీ 17 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకురావడం ఏంట్రా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

'డియర్' కథ విషయానికొస్తే.. న్యూస్ రీడర్‌ అవ్వాలనుకునే అర్జున్ (జీవీ ప్రకాశ్).. చిన్న శబ్దాలకు కూడా నిద్రలో నుంచి లేచిపోయే సమస్యతో బాధపడుతుంటాడు. మరోవైపు గురక సమస్యతో బాధపడుతూ ఉంటుంది దీపిక (ఐశ్వర్యా రాజేశ్). ఒకరి సమస్యలు మరొకరికి తెలియకుండా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఏమైంది అనేదే కథ.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)