Breaking News

మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!

Published on Thu, 04/17/2025 - 15:51

దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్‌ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్‌ గుడ్ బ్యాడ్‌ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్‌ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే తాజాగా టామ్ చాకో మరో వివాదం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌ సెట్‌లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా  ప్రవర్తించాడని మలయాళ నటి  విన్సీ సోనీ అలోషియస్‌ ఆరోపణలు చేస్తోంది. దీంతో అతనిపై కేరళ ఫిల్మ్‌ ఛాంబర్‌తో పాటు అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసిన విచారణ చేయనున్నట్లు అమ్మ(AMMA) అసోసియేషన్ వెల్లడించింది. షైన్ టామ్ చాకోతో కలిసి విన్సీ సోనీ సూత్రవాక్యం అనే సినిమాలో నటించింది. ఆమె ఆరోపణలతో చాకోపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి: దసరా విలన్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటన)

మరోవైపు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్‌కు వెళ్లగా ఆయన హోటల్ నుంచి పారిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.  పోలీసుల బృందం హోటల్‌కు రావడానికి ముందే తప్పించుకున్నారని సమాచారం. మూడో అంతస్తులో ఉన్న నటుడు.. కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి మెట్ల మార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైమైనా గతంలో ఓ డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ఆరోపణలు రావడం గమనార్హం.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు