హీరో రానా నుంచి 'బూతుల' సినిమా.. టీజర్ రిలీజ్

Published on Sat, 10/11/2025 - 15:58

రీసెంట్ టైంలో సినిమాల్లో వైల్డ్‌నెస్ పేరిట బూతుల్ని, బూతు సన్నివేశాల్ని అక్కడక్కడ ఉపయోగిస్తున్నారు. కొన్నింటికి సెన్సార్ కత‍్తెర వేస్తున్నప్పటికీ మరికొన్నిసార్లు మాత్రం మూవీకి 'ఏ' సర్టిఫికెట్ లాంటివి తెచ్చుకుని రిలీజ్ చేస్తున్నారు. వీటిని యూత్ చూస్తారు. ఫ్యామిలీ అడియెన్స్ కాస్త దూరంగానే ఉంటారు. సరే ఇదంతా పక్కనబెడితే రానా నిర్మాతగా 'డార్క్ చాక్లెట్' అనే మూవీ త్వరలో రాబోతుంది. దీని టీజర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)

టీజర్ చూస్తుంటే.. యజ్ఞ అనే హీరో, ఓ ముగ్గురు వ్యక్తుల(ఓ మహిళ, ఇద్దరు పురుషులు) మధ్య జరిగే కథే ఈ సినిమా స్టోరీలా అనిపిస్తుంది. టీజర్ లో బూతు సన్నివేశాలేం లేవు గానీ బూతు మాటలు మాత్రం కాస్త గట్టిగానే వినిపించాయి. వీటిని టీజర్ కోసమే పెట్టారా? నిజంగా మూవీలోనూ ఉంచుతారా అనేది చూడాలి? అయితే హీరో రానా నిర్మాతగా ఈ తరహా మూవీ వస్తుందని అస్సలు ఊహించలేదు.

'35' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వదేవ్ ఇందులో హీరో కాగా బిందుమాధవి హీరోయిన్. మరో ఇద్దరు కూడా తెలుగు నటులే. 'కిడ్స్ పక్కకెళ్లి ఆడుకోండి' ,'పాన్ మసాలా మూవీ', 'జానర్ అడగొద్దు' లాంటి క్యాప్షన్స్ చూస్తుంటే కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అలానే రిలీజ్ ఎప్పుడనేది కూడా అక్టోబరు 31, నవంబరు 14, డిసెంబరు 5 అని మూడు తేదీలు ప్రకటించి, మనల్నే ఎంచుకోమన్నట్లు చూపించారు. శశాంక్ శ్రీ వాస్తవ్య దర్శకుడు కాగా వివేక్ సాగర్ సంగీతమందించాడు. చూస్తుంటే ఇది పెద్దల కోసం మాత్రమే తీసిన సినిమాలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: మొన్న విజయ్‌..నేడు రష్మిక.. అలా బయటపెట్టేశారుగా!)

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)