ఓటీటీలోకి వచ్చేందుకు 'రాయన్‌' ఫిక్స్‌ అయ్యాడా..?

Published on Mon, 08/12/2024 - 15:11

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. రాయన్‌ చిత్రాన్ని తెరకెక్కించిన తీరును చూసిన ప్రేక్షకులు ధనుష్‌ టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. ఇందులోని నటీనటులు అందరూ కూడా తమ అద్భుతమైన నటనతో ఇచ్చిపడేశారు.  టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేశ్‌ బాబు వంటి వారు కూడా రాయన్‌ సినిమా చూసి ఫిదా అయ్యారు. జూలై 27న విడుదలైన రాయన్‌ ఇప్పటి వరకు సుమారు రూ. 140 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

రాయన్ సినిమా ఈనెల చివరి వారంలో ఓటీటీలోకి రానుందని వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో రాయన్‌తో భారీ ఢీల్‌ సెట్‌ చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో ఓటీటీలో విడుదల చేయాలనే ఒప్పందం ఉన్నట్లు సమాచారం. దీంతో  ఆగస్టు 30వ తేదీన రాయన్‌ స్ట్రీమింగ్‌కు రావచ్చని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

రాయన్ సినిమాలో ధనుష్‍తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్‌.జే సూర్య వంటి స్టార్స్‌ నటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని సన్‍పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఇప్పిటికే బాక్సాఫీస్‌ వద్ద భారీగానే ఆ సంస్థ లాభాలు అందుకుంది.  ఈ మూవీకి  ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్‌ తన తర్వాతి ప్రాజెక్ట్‌పై నిమగ్నమయ్యాడు.  డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్‌ కూడా నటిస్తున్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)