Breaking News

దుర్గాదేవి ఈవెంట్‌కి మందేసి వచ్చారా? దలేర్ మెహందీపై మంత్రి ఆరోపణ

Published on Tue, 10/20/2026 - 15:23

బోలో తా రా రా, హో జాయేగీ బల్లే బల్లే లాంటి హిట్ పాటలతో 90ల్లో గుర్తింపు తెచ్చుకున్న పంజాబీ సింగర్ దలేర్ మెహందీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. దుర్గాదేని నవరాత్రుల సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ఈయన మందు తాగి స్టేజీపై పాటలు పాడారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రమంత్రి ఈ ఆరోపణలు చేయడమే దీనికి కారణం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ టైమ్ లూప్ ‍థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

ఇంతకీ అసలేం జరిగింది?
ఆదివారం రాత్రి ఉత్తరాఖండ్‌లోని న్యూ తెహ్రీలో చారిత్రాత్మక సిద్ధపీఠ్ మా కుంజాపురి పర్యాటక, అభివృద్ధి జాతర జరిగింది. ఇందులోని పాటల కార్యక్రమంలో దలేర్ మెహందీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే ఈ గాయకుడు పాడుతున్న టైంలో స్టేజీపైకి వచ్చిన రాష్ట్రమంత్రి సుభోద్ ఉనియాల్.. మీరు సరిగా మాట్లాడలేకపోతున్నారు. నిలబడేందుకు కూడా ఇబ్బందిపడుతున్నారు. మందు కొట్టి వచ్చారా? పెదవులు కదిలిస్తూ ప్రేక్షకుల్ని ఫుల్స్ చేస్తున్నారా? అని ప్రశ్నించాడు. దీంతో వివాదం చెలరేగింది.

దలేర్ మెహందీకి సపోర్ట్ చేస్తూ మికా సింగ్, పలాష్ సేన్ తదితరులు మాట్లాడారు. దలేర్ మెహందీ ఒకవేళ మద్యపానం చేసుంటే తాను సింగింగ్ కెరీర్ వదిలేస్తానని మికా సింగ్ ఛాలెంజ్ చేశారు. ఇక తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న మంత్రి సుభోద్.. ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆయన(దలేర్ మెహందీ) ఒక గొప్ప కళాకారుడు. అలాంటి వ్యక్తి తన కళకు న్యాయం చేయకపోతే ఎలా? వేదికపై ఆయన అయోమయంగా కనిపించారు. నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. తన పాటలకు పెదవులు మాత్రమే కదుపుతున్నారు. ఆయన ఒక గొప్ప కళాకారుడని, తన కళకు న్యాయం చేయాలని నేను చెప్పాను. ప్రదర్శన ఇవ్వడానికి ఆయనకు రూ.35 లక్షలు ఆఫర్ చేశారు. కానీ ఆయన పాటలు కూడా పాడటం లేదు. అందుకే నేను నా అసంతృప్తిని వ్యక్తం చేశాను అని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' కొత్త రిలీజ్ డేట్.. ఈసారైనా వస్తారా?)

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)