Breaking News

అభిరామ్‌ను ఇంటి నుంచి వెళ్లగొట్టారా? హీరో ఏమన్నాడంటే?

Published on Sun, 10/15/2023 - 14:28

దగ్గుబాటి సురేశ్‌ రెండో తనయుడు అభిరామ్‌ అహింస సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో అతడు సినిమాలను పక్కనపెట్టి వ్యాపారరంగంపై ఫోకస్‌ పెట్టాడు. రైటర్స్‌ కేఫ్‌ పేరిట హైదరాబాద్‌లో ఓ కేఫ్‌ ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాల గురించి మాట్లాడాడు.

నా కాళ్లపై నిలబడాలనుకున్నా..
'జీవితం అనేది అంత ఈజీ కాదు. వయసు పెరిగేకొద్దీ అన్నీ తెలిసొస్తాయి. తాతయ్య చనిపోయినప్పుడు జీవితం విలువ తెలిసొచ్చింది. బాధ్యతలు తెలుసుకున్నాను. సొంతంగా నా కాళ్లపై నిలబడాలనుకున్నాను. అందులో భాగంగానే కేఫ్‌ ప్రారంభించాను. కేఫ్‌ స్టార్ట్‌ చేయడం వల్ల ఇంట్లోవాళ్లు కోప్పడి నన్ను ఇంటి నుంచి వెళ్లిపోమన్నారంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నిజానికి నాన్న, అన్నయ్య, బాబాయ్‌ నాకు రకరకాల సలహాలిస్తూ ఎంతగానో సాయం చేశారు. వ్యాపారం ఎలా చేయాలనేది నాన్న దగ్గరి నుంచి నేర్చుకున్నాను. కేఫ్‌ ఎలా నడపాలన్నది అన్న చెప్తూ ఉంటాడు.

నేనే గ్యాప్‌ తీసుకున్నా..
నాకు, రానా అన్నకు మధ్య 10 ఏళ్ల వ్యత్యాసం ఉంది. తను నన్ను తమ్ముడిలా కాకుండా స్నేహితుడిలా ట్రీట్‌ చేస్తాడు. సినిమా అవకాశాలొస్తున్నాయి, కానీ నేనే గ్యాప్‌ తీసుకున్నాను. నటుడిగా నేను చాలా నేర్చుకోవాలి. అందుకే అహింస తర్వాత బ్రేక్‌ తీసుకున్నాను. యాక్షన్‌ లవ్‌స్టోరీలు చేయడమంటే ఇష్టం. నా పేరెంట్స్‌ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారిని చేసుకుంటాను. పెళ్లి విషయాన్ని వారికే వదిలేశాను' అని చెప్పుకొచ్చాడు అభిరామ్‌.

చదవండి: నా భర్త రివర్స్‌ అయితే ఎవరూ పనికి రారు, డబుల్‌ ఇచ్చిపడేస్తాడు.. సందీప్‌ మాస్టర్‌ భార్య ఫైర్‌

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)