ఓటీటీలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా

Published on Sat, 11/07/2026 - 11:31

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా ఐ యామ్ గేమ్, బా బా బ్లాక్ షీప్, అనకాపల్లి, మీసయ్య మురుక్కు 2 లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. మరోవైపు వచ్చేవారానికి సంబంధించిన ప్రకటనలు కూడా వస్తున్నాయి. అలా ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రిలీజ్ గురించి ప్రకటించారు. ఇంతకీ దీని సంగతేంటి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

'సలార్'తో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరో పృథ్వీరాజ్.. మహేశ్ 'వారణాసి'లో విలన్‌గా చేశాడు. ఇతడు లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిందీ మూవీ 'దాయిరా'. కరీనా కపూర్ మరో కీలక పాత్ర పోషించింది. సెప్టెంబరు 18న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. వచ్చే శుక్రవారం(నవంబరు 13) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

'దాయిరా' విషయానికొస్తే.. ఢిల్లీలో రాగిణి (ప్రగతి మిశ్రా) అనే అమ్మాయిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనమవుతుంది. ఈ కేసును డీసీపీ రామన్‌ కుమార్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) విచారించి, నలుగురు నిందితుల్ని అరెస్టు చేస్తాడు. తక్షణ న్యాయం అందించాలనుకుని ఆ నలుగుర్ని తన టీమ్‌తో కలిసి ఎన్‌కౌంటర్‌ చేసేస్తాడు. దీంతో ప్రజలు, మీడియా రామన్‌ని హీరోలా పొగుడుతారు. కానీ, ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనని మానవ హక్కుల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంటుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

ఈ ఎన్‌కౌంటర్‌ నిజమైనదా లేక ఫేక్‌ ఎన్‌కౌంటరా? అనేది తేల్చడానికి విజిలెన్స్‌ అధికారి, డీసీపీ అజూని కోహ్లి (కరీనా కపూర్‌) నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేస్తుంది. చట్టప్రకారమే నడుచుకోవాలనుకునే అజూని కోహ్లి.. రాగిణి హత్యాచార కేసుని, రామన్‌ చేపట్టిన ఎన్‌కౌంటర్‌ని ఏ కోణంలో విచారించింది? ఆమె తెలుసుకున్న నిజాలేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన దిశా హత్యాచార కేసు, ఢిల్లీలోని నిర్భయ కేసుని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీశారు. కాకపోతే థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడంతో డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. థియేటర్లలో పెద్దగా ఆడలేదు. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలో 'హనుమాన్ అన్ష్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)