Breaking News

చదివింది ఇంటర్‌, ఫస్ట్‌ సినిమానే హిట్‌.. లగ్జరీ కారు కొన్న నటి

Published on Fri, 07/04/2025 - 10:28

హీరో నాని నిర్మించిన 'కోర్ట్‌' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలో 'జాబిలి' పాత్రలో నటించిన తెలుగమ్మాయి శ్రీదేవి బాగా పాపులర్‌ అయిపోయింది.  వైష్ణవ్‌తేజ్‌ చేసిన ‘ఆదికేశవ’లో ఓ పాత్రలో ఆమె కనిపించినప్పటికీ హీరోయిన్‌గా కోర్ట్‌ సినిమానే మొదటిది కావడం విశేషం. తాజాగా కొత్త కారు కొన్నట్లు శ్రీదేవి సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్‌ చేసింది

కొత్త కారు కొనడం తన కోరిక అంటూ.. ఎంజీ హెక్టార్‌ (MG Hector) కారును శ్రీదేవి పోస్ట్‌ చేసింది. అయితే, ఈ లగ్జరీ కారు ధర రూ. 25 లక్షల వరకు వుంటుందని సమాచారం. చిన్నవయసులోనే తను అనుకున్న కలను నెరవేర్చుకుందని శ్రీదేవిపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కోర్టు సినిమాకు గాను రూ. 10 లక్షలు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా ద్వారా ఆమెకు సోషల్‌మీడియాలో ఫాలోవర్స్‌ పెరిగారు. ఆపై పలు సినిమా ఛాన్సులు రావడంతో కాస్త సంపాదన కూడా పెరిగిందని టాక్‌.

శ్రీదేవి పూర్తిపేరు శ్రీదేవి ఆపళ్ల. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఈమె సొంతూరు. 'కోర్ట్' మూవీలో జాబిలి పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీశ్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఓ ఇన్ స్టా రీల్ ని ఫ్రెండ్ చూపించాడు. దీంతో ఈమెనే జాబిలి అని ఫిక్సయ్యాడు. పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. ఈ ఏడాదిలోనే ఆమె ఇంటర్‌ పూర్తి చేసింది. అమ్మానాన్నలిద్దరూ రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఉన్నారు. సినిమాలు అంటే ఇష్టంతోనే ఎక్కువగా రీల్స్‌ చేసేదానిని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)