Breaking News

మహేశ్‌బాబుకు వినియోగదారుల కమిషన్‌ నోటీసులు

Published on Mon, 07/07/2025 - 06:57

సినీ నటుడు మహేష్‌ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా, ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆయన్ని.. 3వ ప్రతివాదిగా పేర్కొంటూ నమోదైన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు ప్రతివాదులకు నోటీసులిచ్చిన కమిషన్‌.. ప్రతివాదుల హాజరు కోసం విచారణను సోమవారాని కి వాయిదా వేసింది. 

సాయి సూర్య డెవలపర్స్‌ బాలాపూర్‌ గ్రామంలో లేఅవుట్‌ వేశామని చెప్పడంతో ఆకర్షితులైన ఓ మహిళా డాక్టర్, మరో వ్యక్తి చెరో ప్లాటు కొనడానికి రూ. 34.80 లక్షలు చెల్లించారు. అయితే ప్రతిపాదిత ప్రాంతంలో లేఅవుట్‌ లేదని తెలుసుకొని డబ్బు తిరిగివ్వాలని అడగ్గా సంస్థ యజమాని కంచర్ల సతీశ్‌చంద్ర గుప్తా రూ. 15 లక్షలే చెల్లించారు. బాధితులు వేసిన కేసులో సంస్థతోపాటు దాని యజమాని, ప్రచారకర్తగా ఉన్న మహేశ్‌బాబును ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే రియల్‌ ఎస్టేట్‌ మనీలాండరింగ్‌ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సైతం మహేష్‌బాబుకి గతంలో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది.

 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు