Breaking News

తొలి సినిమాతోనే సత్తా చాటిన దర్శకుడు జానకిరామ్

Published on Sun, 10/18/2026 - 14:52

తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కొందరికి అలా జరిగిపోతూ ఉంటుంది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీతో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఇలా తన ప్రతిభ చాటుకున్నారు. సింపుల్ వన్‌లైనర్స్, సహజమైన సంభాషణలు, సందర్భానుసారంగా వచ్చే కామెడీతో థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించారు. భారీ కామెడీ సన్నివేశాలపై ఆధారపడకుండా, సాధారణ సన్నివేశాలతోనే వినోదాన్ని పంచడంలో సక్సెస్ అయ్యారు.

(ఇదీ చదవండి: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ రివ్యూ)

కామెడీ మాత్రమే కాకుండా, కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా జానకిరామ్ అద్భుతంగా తెరకెక్కించారు. తన గురువు, దర్శకుడు బాబీ తరహాలోనే  యాక్షన్ సన్నివేశాలను రిచ్‌గా, ఆకట్టుకునే విజువల్స్‌తో రూపొందిస్తూ తనలోని టేకింగ్ స్కిల్‌ను చాటుకున్నారు. కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచుతూనే, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపడం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.

తొలి సినిమాతోనే వినోదానికి పెద్దపీట వేస్తూ, కథను ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానంతో జానకిరామ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకులను మెప్పించేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంలో తనకున్న పట్టుని ప్రూవ్ చేసుకున్నారు. కామెడీ, యాక్షన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక కంప్లీట్  కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.

‘కామ్రేడ్ కళ్యాణ్’ విజయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న జానకిరామ్.. ఇదే టాలెంట్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన సినిమాలతో అలరించే అవకాశం ఉంది. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఇప్పుడు అంచనాలు పెరిగాయి.

(ఇదీ చదవండి: జైలర్ 2 వర్సెస్ రణబాలి.. అదొక్కటే పెద్ద మైనస్..!)

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)