బాలకృష్ణ షో వల్లే బెట్టింగ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నా: బాధితుడి ఆవేదన

Published on Fri, 03/21/2025 - 18:46

బెట్టింగ్ యాప్ కేసు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి యాప్‌లను కొందరు టాలీవుడ్ బుల్లితెర నటులతో పాటు పలువురు ‍అగ్ర సినీతారల పేర్లు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు ముందు యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరి హాజరైన తమ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. యాప్‌లను ప్రమోట్ చేసినట్లు విచారణలో అంగీకరించారు.

అయితే ఈ బెట్టింగ్‌ యాప్‌ల వలలో చిక్కుకుని అప్పులపాలైన వారు చాలామందే ఉన్నారు. అలా ఈ బెట్టింగ్ భూతానికి బలైన ఓ సామాన్యుడు పంజాగుట్ట పీఎస్‌కు వచ్చారు. తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తిని మీడియా ప్రశ్నించింది. తాను ఈ యాప్‌ను ఉపయోగించడానికి కారణం ఆ టాలీవుడ్ షోనే కారణమని బాధితుడు చెప్పారు.

టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షో వల్లే తాను బెట్టింగ్ యాప్‌ను ఉపయోగించానని నెల్లూరు చెందిన రాంబాబు వాపోయారు. బాలయ్య షోకు అతిథులుగా వచ్చిన గోపీచంద్, ప్రభాస్‌కు బాలకృష్ణ కొన్ని బహుమతులిస్తారు.. ఈ గేమ్ ఆడండి.. గిఫ్ట్‌లు గెలుచుకోండి అని చూపించారని అన్నారు. నేను మొదటి నుంచి ప్రభాస్ అన్నకు ఫ్యాన్ అని.. అందువల్లే తాను కూడా ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత ట్రాప్‌లో పడి దాదాపు రూ.80 లక్షలు కోల్పోయినట్లు సదరు వ్యక్తి వివరించాడు. ఆ యాప్‌ వాళ్లు మోసం చేయడం వల్లే తాను అప్పుల పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‍అప్పుల భారంతో ఎనిమిది నెలలుగా ఇంటికి దూరంగా ఉంటున్నట్లు బాధితుడు రాంబాబు చెప్పుకొచ్చారు.

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)