Breaking News

విషాదం.. ప్రముఖ హాస్య నటుడు మృతి

Published on Tue, 03/26/2024 - 18:49

తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు శేషు(60) మృతి చెందారు. కొన్నాళ్ల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నై ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న శేషు.. నేడు(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. శేషు పూర్తి పేరు లక్ష్మీ నారాయణన్  శేషు.2002లో ధనుష్ చిత్రం తుళ్లువదో ఇలామైలో వెండితెర అరంగేట్రం చేశారు.  విజయ్ టీవీ కామెడీ షో ‘లొల్లు సభ’తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.  

తమిళ్ లో 30కి పైగా చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా  నటుడు సంతానంతో గొప్ప స్నేహం ఉంది. అందుకే ఆయన నటించిన ప్రతి సినిమాలో శేషు ఉంటాడు. ఇక ఈ మధ్య సంతానం హీరోగా నటించిన వడక్కుపట్టి రామసామి లో కూడా శేషు నటించి మెప్పించాడు. అదే ఆయన చివరి చిత్రం.  శేషుకు ముగ్గురు కొడుకులు. బుధవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. శేషు మరణ వార్త విన్న ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)