Breaking News

'సలార్' అప్డేట్.. స్టార్ కమెడియన్ అలా అనడంతో!

Published on Sun, 07/09/2023 - 15:32

ఈ ఏడాది.. చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో 'సలార్' ఒకటి. ప్రభాస్ హీరో కావడం, ఈ మధ్య రిలీజైన 'ఆదిపురుష్' ఘోరంగా ఫ్లాప్ కావడం.. దీనికి కారణాలు అని చెప్పొచ్చు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి టైంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఇదే చిత్రంలో నటించిన ఓ స్టార్ కమెడియన్ బయటపెట్టాడు. అతడి చెప్పింది వింటే మీరు కూడా నిజమే అనుకుంటారు. 

(ఇదీ చదవండి: తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. హీరోయిన్ ఇలియానా ఇబ్బందులు!)

కేజీఎఫ్ రెండు పార్ట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా 'సలార్'. దీన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య తొలి పార్ట్ కి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఇందులో హీరో ప్రభాస్ ని 10 సెకన్ల కంటే తక్కువగా చూపించారు. అయినాసరే 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో ఇప్పటికే ఇది సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ని ఆగస్టులో రిలీజ్ చేస్తామని స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. 

ఇక ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి కూడా నటించాడు. స్వయంగా అతడే ఈ విషయాన్ని బయటపెట్టాడు. తన డబ్బింగ్ కూడా పూర్తయినట్లు ఓ ఫొటోని ట్వీట్ చేశాడు. అలానే 'సలార్'.. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.2000 కోట్ల మార్క్ క్రాస్ చేస్తుందని వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. గతంలో బాహుబలి 2 (రూ 1788.06 కోట్లు), కేజీఎఫ్ 2 (రూ.1230 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.1275 కోట్లు) మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో ఎక్కువ వసూళ్లు సాధించాయి. మరి వీటిని 'సలార్' అధిగమిస్తుందో లేదా అనేది చూడాలి? 

(ఇదీ చదవండి: గే రిలేషన్‌షిప్‌లో కొడుకు? నా నిర్ణయం అదే: 'అదుర్స్' విలన్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)