నేను ఆరోగ్యంగా ఉన్నాను.. ఆ వార్తలు నమ్మకండి: నటుడు సుధాకర్‌

Published on Thu, 05/25/2023 - 13:15

సీనియర్‌ నటుడు, కమెడియన్‌ సుధాకర్‌ చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుధాకర్ అనారోగ్యంతో బాధడపడుతున్నారని, ఐసీయూలో ఉన్నారంటూ గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో రూమర్స్‌ వినిపిస్తున్నాయి. దీనికి తోడు పరిస్థితి విషమించి ఆయన చనిపోయినట్లు ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి.

తాజాగా ఈ తప్పుడు వార్తలపై సుధాకర్‌ స్వయంగా స్పందించారు. కొంతకాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలిపారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, తప్పుడు వార్తలను దయచేసి నమ్మవద్దని కోరారు. ఈ మేరకు స్వయంగా ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను క్రియేట్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా నటుడు సుధాకర్‌ చనిపోయినట్లు వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సర్యులేట్‌ అయ్యాయి. ఈమధ్యే నటుడు కోట శ్రీనివాసరావు కూడా చనిపోయినట్లు తప్పుడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

దీంతో ఆయన కూడా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బతికున్న మనుషుల్ని కూడా చంపేస్తున్నారంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు