APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్
Breaking News
నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు: జేసన్ సంజయ్
Published on Wed, 09/16/2026 - 23:50
కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘సిగ్మా’ చిత్రంతో ఆయన మెగాఫోన్ పట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో జేసన్ సంజయ్ తెలుగు సినిమాలపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాలు తన ఆల్‌టైమ్ ఫేవరెట్స్ అని తెలిపారు.
నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు
‘‘సిగ్మా’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్న జేసన్ సంజయ్ చాలా టాలెంటెడ్. ఈ సినిమా అందర్నీ వినోదపరుస్తుంది’’ అని సందీప్ కిషన్ చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా లైకాప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ తెలుగు–తమిళ భాషల్లో నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 2న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో జేసన్ సంజయ్ మాట్లాడుతూ– ‘‘నేను కాలేజీలో డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్ చదువుకున్నాను. సినిమా ప్రయాణంలో 24 క్రాఫ్ట్స్‌తో కలిసి పని చేశాను. ఈ ప్రయాణంలో మా నాన్న (విజయ్), నా కుటుంబం, అభిమానులు ఎంతగానో సపోర్ట్ చేశారు. ‘మైఖేల్’ సినిమాలో సందీప్ కిషన్ నటన నచ్చడంతోనే ‘సిగ్మా’ కోసం ఆయనను హీరోగా ఎంపిక చేశాను. నేను ఎలాంటి సినిమా చేశానో చూడటానికి మా నాన్నగారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’’ అని తెలిపారు. ‘‘సిగ్మా’ నా తొలి తమిళ చిత్రం అయినప్పటికీ డబ్బింగ్ చెప్పాను’’ అని ఫరియా పేర్కొన్నారు. ‘‘సిగ్మా’తో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరో పెద్ద విజయం సాధిస్తామని నమ్ముతున్నాం’’ అన్నారు మైత్రీ శశిధర్ రెడ్డి.
Tags : 1