Breaking News

విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే

Published on Sat, 06/27/2026 - 14:59

టాలీవుడ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. స్టార్ హీరోల సినిమాలు చెప్పిన టైంకి రిలీజ్ కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇలా జరగడానికి హీరోలు కారణమా? దర్శకులు లేదా పరిస్థితులు కారణమా అనే సంగతి పక్కనబెడితే ఆలస్యం మాత్రం జరుగుతోంది. ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ వర్కింగ్ స్టైల్ ఫాలో అయితే గనక తెలుగు హీరోలు ఈ వాయిదాల్ని కచ్చితంగా అధిగమించొచ్చు. నిర్మాత దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

(ఇదీ చదవండి: నేనే మీకు నిజం చెబుతాను.. కమెడియన్ షాకింగ్ వీడియో)

'విజయ్ ఓ సినిమా కోసం 100 రోజుల కాల్ షీట్ కేటాయిస్తారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 20 తేదీ వరకు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటారు. అలా వరసగా ఐదు నెలల్లో మూవీ పూర్తి చేస్తారు. నెలలో మిగిలిన రోజులు విశ్రాంతి తీసుకోవడం, స్టోరీ డిస్కషన్స్, డబ్బింగ్, ప్రమోషన్స్ లాంటి వాటి కోసం వినియోగిస్తారు. ఇలా కచ్చితమైన షెడ్యూల్స్ వల్ల మూవీ టీమ్‌కి చాలా ప్లస్ అవుతుంది. విజయ్ కాల్ షీట్స్ ముందే ఫిక్స్ అయిపోతాయి కాబట్టి షూటింగ్ లొకేషన్స్, మిగతా నటీనటులు కాల్ షీట్స్, టెక్నికల్ అంశాల సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే విజయ్ వర్కింగ్ స్టైల్.. ఇండస్ట్రీలోనే ఆదర్శం. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ ఇలానే చేసేవారు' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

స్వతహాగా తెలుగు నిర్మాత అయిన దిల్ రాజు.. వారిసు(తెలుగులో 'వారసుడు')తో తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ 2023 సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చింది. రూ.200-250 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించింది.

(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా)

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)