Breaking News

'ఓవర్ యాక్టింగ్ ఆపమన్న నిఖిల్'.. వార్‌ను తలపించిన బిగ్‌బాస్‌ హౌస్‌!

Published on Tue, 10/29/2024 - 19:04

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్‌బాస్‌ షో కాస్తా రసవత్తరంగానే సాగుతోంది. కొత్త, పాత నీరు కలవడంతో పోటాపోటీగా హౌస్‌లో హల్‌చల్‌ చేస్తున్నారు. ఇక నామినేషన్స్ టైమ్‌లో ‍అయితే కంటెస్టెంట్స్‌ ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. గతవారం వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్‌ మెహబూబ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ గొడవ మొదలైనట్లే. అలా ఈ వారంలో  గౌతమ్‌, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేషన్స్‌లో ఉన్నారు.

ఇక నామినేషన్స్‌ గోల ముగియడంతో ఈ రోజు టాస్క్‌ల గోల మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో పానిపట్టు యుద్ధం అంటూ హౌస్‌మేట్స్‌కు సరికొత్త పోటీ పెట్టాడు బిగ్‌బాస్‌. నీళ్ల ట్యాంకుల టాస్క్ ఇవ్వడంతో హౌస్‌మేట్స్‌ పోటాపోటీగా పాల్గొన్నారు. ఇక టాస్క్‌లో భాగంగా నిఖిల్ రెచ్చిపోయాడు. యష్మితోపాటు ఇద్దరి చేతులను పట్టుకుని లాగాడు. దీంతో గౌతమ్‌ నీకసలు బుద్ది ఉందా? అంటూ నిఖిల్‌ను హెచ్చరించాడు. సంచాలక్‌కు రెస్పెక్ట్‌ ఇవ్వరా? అంటూ యష్మి మండిపడింది.

టాస్క్ కాస్తా దారి మళ్లీ గౌతమ్, నిఖిల్ మధ్య తీవ్ర గొడవకు దారితీసింది. నీకసలు సెన్స్ ఉందా? అంటూ గౌతమ్ అనడంతో నిఖిల్ మరింత ఫైరయ్యాడు. ఆపు నీ ఓవర్ యాక్టింగ్ అని నిఖిల్ చెప్పడంతో.. నీది ఓవర్ యాక్టింగ్ గౌతమ్‌ మీదికి దూసుకెళ్లాడు. ఈ గొడవ ఇద్దరు చివరికీ కొట్టుకునే దాకా వెళ్లడంతో అవినాశ్, పృథ్వీ వారిని నిలువరించారు. ఈ టాస్క్ గోల పూర్తిగా తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)