Breaking News

18 ఏళ్లుగా ఎదురుచూపులు.. ఇన్నాళ్లకు మెగా సక్సెస్‌

Published on Fri, 01/09/2026 - 15:09

ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తేనే గౌరవం. కొరియోగ్రాఫర్‌ ఆట సందీప్‌కు కావాల్సినంత టాలెంట్‌ ఉంది. కానీ విజయం మాత్రం ఆవగింజంత కూడా లేదు. చాలాఏళ్లుగా ఆ సక్సెస్‌ కోసమే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కొంతకాలం క్రితం డ్యాన్స్‌ స్టూడియో ప్రారంభించి భార్యతో కలిసి స్టూడెంట్స్‌కు డ్యాన్స్‌ క్లాసులు నేర్పిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల కిందట కెరీర్‌ మొదలుపెట్టిన సందీప్‌కు ఎట్టకేలకు సక్సెస్‌ దొరికింది. రోషన్‌ 'ఛాంపియన్‌' మూవీలో 'గిరగిర గింగిరానివే..', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్‌'లో 'హుక్‌ స్టెప్‌' పాటలతో ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యాడు. అతడి జర్నీ ఓసారి చూసేద్దాం..

సోషల్‌ మీడియాలో ఫేమస్‌
ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో ఆట మొదటి సీజన్‌లో పాల్గొని విన్నర్‌గా నిలిచాడు సందీప్‌. అప్పటినుంచి అతడి పేరు ఆట సందీప్‌గా స్థిరపడింది. తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లోనూ పార్టిసిపేట్‌ చేశాడు. సందీప్‌ భార్య జ్యోతిరాజ్‌ కూడా డ్యాన్స్‌ మాస్టరే.. వీరిద్దరూ సోషల్‌ మీడియాలో చేసే రీల్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఈ జంట టాలెంట్‌కు బోలెడన్ని సినిమా అవకాశాలు రావాలని అభిమానులు అభిప్రాయపడ్డారు.

గిరగిర గింగిరానివే.. పాటతో క్లిక్‌
సందీప్‌.. కొరియోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలు చేశాడు కానీ మంచి సక్సెస్‌ అందుకోలేకపోయాడు. ఆమధ్య హీరోగా లవ్‌ యూ టూ అని ఓ మూవీ కూడా చేశాడు. కానీ వర్కవుట్‌ కాలేదు. ఇక సందీప్‌ డ్యాన్స్‌ రీల్‌ చూసి ఛాంపియన్‌ మూవీ నిర్మాత స్వప్నదత్‌ ఓసారి అతడికి కాల్‌ చేసింది. తన సినిమాలో కొరియోగ్రఫీ చేయమని అడిగింది. అలా అతడి హిట్‌ లిస్ట్‌లో మొదటి పాటగా గిరగిర గింగిరానివే.. వచ్చి చేరింది. సందీప్‌ దంపతుల టాలెంట్‌ చిరంజీవికి కూడా తెలిసింది. వెంటనే ఆయన వీరిని ఇంటికి పిలిచి మరీ ఛాన్స్‌ ఇచ్చాడు.

ఫేవరెట్‌ హీరోకి కొరియోగ్రఫీ
మన శంకర వరప్రసాద్‌ మూవీలో హుక్‌ స్టెప్‌ సాంగ్‌ చేయమని వరం ప్రసాదించాడు. అసలే సందీప్‌ ఫేవరెట్‌ హీరో ఆయన.. అలాంటిది పిలిచి మరీ అవకాశం ఇచ్చాక నిరూపించుకోకుండా ఉంటాడా? సింపుల్‌గా ఉంటూనే గ్రేస్‌ కనిపించేలా స్టెప్స్‌ క్రియేట్‌ చేశాడు. చిరు కూడా.. అంతే గ్రేస్‌గా, స్టైలిష్‌గా స్టెప్పులేశాడు. ఆ వీడియో వైరల్‌ అవడంతో సందీప్‌కు ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 18 ఏళ్ల తర్వాత ఇంత మంచి విజయం రావడంతో.. ఇన్నేళ్లుగా పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాడు. అనుకున్నది సాధించానని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మరి అతడికి మున్ముందు కూడా మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం..

 

 

చదవండి: ది రాజాసాబ్‌లో ఆ సీన్స్‌ డిలీట్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)