Breaking News

నెమలికళ్ల తూగుతున్న తూనీగల్లా.. పాట విన్నారా?

Published on Mon, 09/23/2024 - 20:46

కొత్త కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల గణేష్‌ మాస్టర్‌ చేతుల మీదుగా విడుదల చేసిన గు...గుగ్గు అనే  పాటకు కూడా మంచి స్పందన వస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి మరో బ్యూటిఫుల్‌ మెలోడి సాంగ్‌ చూడకయ్యో.. నెమలికళ్ల అనే పాటను ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌, ప్రముఖ లిరిసిస్ట్‌ చంద్రబోస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇప్పుడే పాట విన్నాను.. చూడకయ్యో.. నెమలికళ్ల తూగుతున్న తూనీగల్లా అనే పల్లవితో కొనసాగే ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం వుంది. మార్కండేయ ఈ పాటకు చక్కని సాహిత్యంతో పాటు ఆకట్టుకునే స్వరకల్పన చేశాడు. 

అందరికి చేరువయ్యే తేలికైన మాటలతో.. వినగానే రసానుభూతి కలిగించేలా ఉంది. గాయనీ సునీత, సాయిచరణ్‌ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. నాకు ఈ మధ్య కాలంలో అమితంగా నచ్చిన పేరు 'ప్రణయగోదారి'. టైటిల్‌ చాలా కవితాత్మకంగా వుంది. చిత్రం కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాను' అన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్‌ త్వరలోనే ప్రకటించనున్నారు.

 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)