Breaking News

సమ్మర్‌ కష్టమే.. ఫ్యాన్స్‌కి హ్యాండిచ్చిన ‘మెగా’ బ్రదర్స్‌!

Published on Sun, 03/09/2025 - 15:56

టాలీవుడ్‌కి సంక్రాంతి తర్వాత సమ్మర్‌ మంచి సీజన్‌. వేసవి సెలవుల్లో పలు పెద్ద సినిమాలతో పాటు మీడియం, చిన్న చిత్రాలు కూడా విడుదల అవుతుంటాయి. స్కూల్‌, కాలేజీ పిల్లలకు సెలవులు ఉండడంతో వారిని టార్గెట్‌ చేస్తూ సినిమాలను రిలీజ్‌ చేస్తుంటారు. అయితే ప్రతి సమ్మర్‌కి కనీసం రెండు, మూడు పెద్ద సినిమాలైనా సందడి చేసేవి. కానీ  ఈ సారి మాత్రం యావరేజ్‌ సినిమాలతోనే సరిపెట్టుకోవాలేమో. సమ్మర్‌లో సందడి చేస్తామని చెప్పిన మెగా హీరోలు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌.. ఫ్యాన్స్‌కి హ్యాండిచ్చేలా కనిపిస్తోంది. వీరితో పాటు ప్రభాస్‌ కూడా వేసవి సీజన్‌కి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ‘విశ్వంభర’ మూవీ సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సింది. కానీ కొడుకు రామ్‌ చరణ్‌ కోసం చిరు వెనక్కి తగ్గాడు. దీంతో రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’సంక్రాంతికి రిలీజైంది. కానీ చిరంజీవి చేసిన త్యాగానికి గేమ్‌ ఛేంజర్‌ న్యాయం చేయలేకపోయింది. అది పక్కన పెడితే.. విశ్వంభర సమ్మర్‌లో రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. కానీ మేకర్స్‌ మళ్లీ మనసు మార్చుకున్నారట. సమ్మర్‌లో కాకుండా.. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. అదే నిజమైతే సమ్మర్‌లో చిరును తెరపై చూడడం కష్టమే.

మరోవైపు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan ) ‘హరిహర వీరమల్లు’ కూడా రిలీజ్‌ని వాయిదా వేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 28న  ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఇంకా షూటింగ్‌ జరుగుతోంది. ప‌వ‌న్ కు సంబంధించిన కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించాల్సి ఉందట.ఈ షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. వీఎఫెక్స్‌ వర్క్‌ కూడా పెండింగ్‌లోనే ఉంది. ఈ లెక్కన ఈ చిత్రం కూడా వేసవిలో రిలీజ్‌ అవ్వడ కష్టమే అంటున్నారు సినీ పండితులు.

ఇక మెగా ఫ్యామిలీ హ్యాండిచ్చినా.. ప్రభాస్‌ అయినా సమ్మర్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తారనుకుంటే.. అది కూడా కష్టమే అంటున్నారు. ఇంకా షూటింగ్‌ పూర్తి కాలేదట. ఈ చిత్రాన్ని ముందు చెప్పినట్లుగా ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయడం కష్టమే అంటున్నారు. జూన్‌ లేదా జులైలో ఈ చిత్రం రిలీజయ్యే అవకాశం ఉంది. ఇలా పెద్ద సినిమాలన్నీ తమ విడుదలను వాయిదా వేసుకుంటే.. యావరేజ్‌, చిన్న చిత్రాలు మాత్రం రిలీజ్‌కు రెడీ అంటున్నాయి. 
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)