Breaking News

చిరంజీవి బర్త్‌డే ట్రీట్‌.. విశ్వంభర గ్లింప్స్‌ రిలీజ్‌

Published on Thu, 08/21/2025 - 18:06

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi Konidela) ప్రధాన పాత్రలో నటిస్తున్న అడ్వెంచర్‌ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్‌ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష కథానాయికగా నటించగా ఆషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషించారు. రేపు (ఆగస్టు 22) చిరంజీవి బర్త్‌డే సందర్భంగా విశ్వంభర గ్లింప్స్‌ వదిలారు. 

ఊపిరి పోసేవాడి కోసం ఎదురుచూపులు
'ఈ విశ్వంభరలో అసలేం జరిగిందో ఈరోజైనా చెప్తావా?' అన్న పిల్లాడి డైలాగ్‌తో వీడియో ప్రారంభమైంది. 'ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్నిచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతుకున్న ఓ సమూహం తాలూకు నమ్మకం.. అలిసిపోని ఆశయానికి ఊపిరిపోసేవాడు ఒకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాలపాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా చేస్తాడని గొప్పగా ఎదురుచూస్తోంది..' అంటూ మెగాస్టార్‌ను చూపించారు. విలన్లను చిత్తు చేస్తున్నట్లు యాక్షన్‌ సీన్స్‌ జత చేశారు. ఇది చూసిన అభిమానులు.. గ్లింప్స్‌ బాగున్నాయ్‌.. అని కామెంట్లు చేస్తున్నారు.

వచ్చే ఏడాది రిలీజ్‌
సినిమా విషయానికి వస్తే.. విశ్వంభర ఈ ఏడాది జనవరిలోనే రిలీజవ్వాల్సింది. కానీ, వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో సినిమా రావడం కష్టమేనని స్వయంగా మెగాస్టారే వెల్లడించారు. 2026 సమ్మర్‌లో విశ్వంభర ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

చదవండి: కార్తీకదీపం సీరియల్‌ నటి కూతురి పెళ్లి

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)