పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
Breaking News
మనశంకర వరప్రసాద్ గారు.. ప్రీమియర్స్ బుకింగ్స్ టైమ్ ఫిక్స్!
Published on Sun, 01/11/2026 - 02:05
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ నయనతార హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఈ మూవీ రిలీజ్‌కు ముందు రోజు ప్రీమియర్స్ వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. తెలంగాణలోనూ అనుమతులు రావడంతో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు నైజాం ప్రీమియర్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
కాగా.. చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు. అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
The stage is set for the Mega Victory Mass Entertainer 🥳❤️🔥#ManaShankaraVaraPrasadGaru NIZAM PREMIERES BOOKINGS Open TOMORROW 9AM🔥
Grab your tickets for #MSG exclusively on @district_india 🎫
— https://t.co/4IW3XsgR2Z#MSGonJan12th pic.twitter.com/JAlhRdrtOQ— SVC Release (@SVCRelease) January 10, 2026
Tags : 1