Breaking News

చిరంజీవికి పద్మవిభూషణ్‌.. రేర్‌ ఫోటో షేర్‌ చేసిన ఉపాసన

Published on Fri, 01/26/2024 - 18:07

టాలీవుడ్ మెగాస్టార్‌కు  అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించిన విషయం తెలిసిందే. దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు ఆయనకు దక్కడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేస్తూనే ఎందరికో దిక్సూచిగా నిలిచారు. ఇప్పటికే ఆయనకు  2006లో పద్మ భూషణ్ అవార్డు వరించింది. తాజాగా ఆయనకు పద్మవిభూషణ్‌ రావడంతో మెగాస్టార్‌ కుటుంబ సభ్యులతో పాటు తెలుగు ప్రజలు కూడా సంతోషంగా ఉ‍న్నారు.

తాజాగా ఆయన కోడలు ఉపాసన ఒక ప్రత్యేకమైన ఫోటోను షేర్‌ చేస్తూ మరోసారి మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిరంజీవితో పాటు ఐదుగురు మనవరాళ్లుతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసింది. అందులో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత పిల్లలు సమారా, సంహితతో పాటుగా శ్రీజ పిల్లలు నివ్రితి, నివిష్క ఉన్నారు. కానీ  రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు క్లీంకార ఫోటోను మాత్రం రివీల్‌ చేయలేదు. మొఖం స్పష్టంగా కనిపించకుండా బ్లర్‌ చేసి ఉంచారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. మెగా ఫ్యాన్స్‌ ఆ ఫోటోను షేర్‌ చేస్తున్నారు.

తన మామయ్య చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ఉపాసన ఇలా తెలిపారు. చిరంజీవి అంటే కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.. దాతృత్వంలోనూ ఆయన ముందుంటాడు. జీవితంలో నాన్నగా, మామగారిగా, తాతగా మాకు స్ఫూర్తిని ఇచ్చాడు. చిరంజీవికి అభినందనలు. చిరుత, పద్మవిభూషణ్‌తో సత్కరించారని ఉపాసన తెలిపింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)