ఆ సంతోషం, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను: చిరంజీవి

Published on Wed, 02/11/2026 - 17:43

ఎంతటి దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగు పడిందంటే ఎంతో కొంత విజయం లభించినట్లే! అలా తన సినీ ప్రస్థానానికి పునాది వేసిన తొలి సినిమాను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. 1979లో వచ్చిన పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి నటప్రస్థానం మొదలైంది. తొలి మెట్టుకే విజయాన్ని అందుకుని గుండె నిండా ధైర్యంతో ముందడుగు వేశారు. తనను తాను చెక్కుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 

చందమామ కథలాంటి అనుభూతి
తాజాగా ఆయన పునాదిరాళ్లు సెట్‌లో అడుగుపెట్టిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆతృత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. 

నట జీవితానికి పునాది రాళ్లు
ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు" అని ట్వీట్‌ చేశారు. తన ఫస్ట్‌ మూవీ చిత్రీకరణ సమయంలో దిగిన ఫోటోలను ఈ పోస్ట్‌కు జత చేశారు.

 

 

చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేశా: హీరో నిఖిల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)