Breaking News

ఫ్లాప్‌ వస్తే ఎవర్నీ తిట్టను.. బాధ్యత నాదే! కొరటాలకు కౌంటర్‌?

Published on Mon, 01/26/2026 - 14:18

'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ మూవీ విజయోత్సవ వేడుకల్లో చిరు చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. ఖైదీ నెంబర్‌ 150, వాల్తేరు వీరయ్య.. ఈ రెండు సినిమాల షూటింగ్‌కు ఉత్సాహంగా వెళ్లాను. మళ్లీ మన శంకరవరప్రసాద్‌గారు షూటింగ్‌ కూడా అంతే ఎంజాయ్‌ చేశాను. 

నేనే బాధ్యత తీసుకుంటా..
ఈ సినిమాలన్నీ సక్సెస్‌ఫుల్‌ అయ్యాయి. మధ్యలో కొన్ని సినిమాలు ఏదో డౌట్‌గా అనిపించాయి. వాటిని నేను తప్పుపట్టను. తప్పు నా మీద వేసుకుంటాను కానీ ఒకరిపై నెట్టను అన్నాడు. దీంతో ఆచార్య సినిమా విషయంలో వచ్చిన విమర్శలకు చిరు కౌంటరిచ్చాడంటూ నెట్టింట చర్చ మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన మూవీ ఆచార్య (2022). 

ఎవరి పని వాళ్లు చేసుకుంటే బెటర్‌
ఆ సినిమా డిజాస్టర్‌ కాగా దానికి కొరటాలే కారణమని చిరంజీవి అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అనంతరం ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ.. ఎవరి పని వాళ్లు చేసుకుంటే ఈ ప్రపంచమంతా హ్యాపీగా ఉంటుంది అని కామెంట్స్‌ చేశాడు. ఆచార్య స్క్రిప్ట్‌ విషయంలో చిరంజీవి జోక్యం చేసుకోవడం వల్లే ఫ్లాప్‌ అయిందన్న ఆరోపణలు వస్తున్న సమయంలో కొరటాల ఇలాంటి కామెంట్స్‌ చేశాడు. దీంతో ఆయన చిరంజీవిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని పలువురూ భావించారు.

డైరెక్టర్‌కు కౌంటర్‌?
అయితే కొరటాల మాత్రం.. సాధారణంగా పని గురించి మాట్లాడాను తప్ప ఆ వ్యాఖ్యల వెనక మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ నెట్టింట చర్చ మాత్రం ఆగలేదు. ఇప్పుడు చిరంజీవి తన కామెంట్స్‌తో.. తాజాగా కొరటాల శివకు పరోక్షంగా కౌంటరిచ్చారని పలువురు భావిస్తున్నారు.

చదవండి: 3 సబ్జెక్టులు ఫెయిల్‌.. చిరంజీవి పరువు తీయొద్దన్నా.. అనిల్‌ రావిపూడి తండ్రి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)