Breaking News

నా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి

Published on Sat, 03/08/2025 - 13:38

మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఉమెన్స్‌ పేరుతో మెగాస్టార్‌ ఒక ప్రత్యేకమైన  ఇంటర్వ్యూ ఇచ్చారు. చిరంజీవి అమ్మగారు అంజనాదేవితో పాటు ఆయన సోదరీమణులు, సోదరుడు నాగబాబుతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి జీవితంలో జరిగిన అనేక సంఘటనలతో పాటు పలు సరదా విషయాలను వారు పంచుకున్నారు. అయితే, చిరు సోదరీమణులలో మాధవి రావు కూడా ఈ ఇంటర్వ్యూలో కనిపించడం విశేషం. వాస్తవంగా ఆమె మీడియాకు చాలా దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే.

మెగా బ్రదర్స్‌తో పాటు ఇద్దరు సోదరీమణులు ప్రస్తుతం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాము మొత్తం ఏనిమిది మంది అని చిరంజీవి తెలిపారు. చిన్న వయసులోనే తన సోదర,సోదరీమణులు ముగ్గురు చనిపోయారని ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'అమ్మకు  మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేనే ఆరో తరగతి చదువుతున్నప్పుడు రమా అని నాకొక సోదరి ఉండేది. నాగబాబు, కల్యాణ్‌ల కంటే పెద్దది. చిన్న వయసులోనే ఆమెకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చింది. ఒకరోజు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పోన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి   అమ్మ, నేను కలిసి  తీసుకువెళ్లాం. రెండురోజుల తర్వాత రమా చనిపోయింది. 

ఆ బిడ్డ శవాన్ని నా భుజాల మీద పెట్టుకొని రిక్షాలో అమ్మతో పాటు ఇంటికి వచ్చాను. ఆ దృశ్యాలు ఇప్పటికీ నన్ను కలిచివేస్తుంటాయి. నాన్న ఉద్యోగరీత్యా అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఆయనకు ఎలా తెలపాలో కూడా మాకు తెలియలేదు. ఎదోలా తెలిసిన వారి ద్వారా విషయాన్ని నాన్నకు చేరవేశాం. ఇంతలో  చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో అంత్యక్రియలు పూర్తిచేశాం. ఆపై నాన్న వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ రోజు జరిగిన ప్రతి క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. అది తలుచుకున్న ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది.' అని చిరు కంటతడితో ఈ మాటలు చెప్పారు.
 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)