Breaking News

ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధార్థ్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Fri, 11/10/2023 - 17:03

కొన్ని సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించే కంటెంట్ ఉంటుంది. కానీ రాంగ్ టైంలో రిలీజ్ కావడం వల్ల.. థియేటర్లలోకి రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. తీరా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇదే సినిమా జనాలకు నచ్చేయొచ్చు. అలా హీరో సిద్ధార్థ్‌కి హిట్ వచ్చేలా చేసిన ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది.

ఏంటా సినిమా?
తెలుగోడు కానప్పటికీ హీరోగా టాలీవుడ్‪‌లో సిద్ధార్థ్ మంచి క్రేజ్ సంపాదించాడు. కానీ రానురాను సరైన మూవీస్ చేయకపోవడంతో ఇతడిని తెలుగు ప్రేక్షకులు కూడా పక్కనబెట్టేశారు. అలా గత కొన్నాళ్ల నుంచి తమిళంలోనే నటిస్తూ, వాటిని తెలుగులో డబ్ చేస్తున్నాడు. ఈ ఏడాది 'చిన్నా' అనే మూవీని నిర్మించి, లీడ్ రోల్ చేశాడు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల అనే సెన్సిటివ్ పాయింట్‌తో ఈ సినిమా తీశారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!)

'చిన్నా' కథేంటి?
అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపతో కలిసి ఈశ్వర్ (సిద్ధార్థ్).. ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇతడు ఉంటున్న ఊరిలో చిన్నపిల్లల్ని అహహరించి అత్యాచారం చేయడం, దారుణంగా చంపేయడం లాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఈశ్వర్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు వస్తాయి. మరోవైపు ఈశ్వర్ అన్న కూతురు కిడ్నాప్ అవుతుంది. మరి అన్న కూతుర్ని ఈశ్వర్ వెతికి పట్టుకున్నాడా? చివరకు ఏమైందనేదే 'చిన్నా' స్టోరీ.

ఓటీటీ రిలీజ్ డేట్ 
అక్టోబరు 6న తెలుగులో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ నిలబడలేకపోయింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. నవంబరు 17 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)