Breaking News

లారెన్స్‌ను కలిసిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు'

Published on Mon, 07/14/2025 - 11:10

చిన్నప్పుడు పాతిక పైనే సినిమాలు చేశాడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌ రవి రాథోడ్‌ (Ravi Rathod). అయితే అందరికీ విక్రమార్కుడు యాక్టర్‌గానే ఎక్కువ గుర్తుండిపోయాడు. ఇతడిని హీరో, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ చిన్న వయసులోనే దత్తత తీసుకుని మంచి స్కూల్‌లో చేర్పించాడు. కానీ చదువు అబ్బని రాథోడ్‌ సెలవులకు ఊరెళ్లి అక్కడే ఉండిపోయాడు. తిరిగి స్కూలుకు వెళ్లనేలేదు. తర్వాతి కాలంలో చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 

తాగుడుకు బానిస
మద్యానికి బానిసై.. మందు లేకపోతే బతకలేను అన్నంత దుస్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. పోనీ, చిన్నప్పుడు చదువు చెప్పించాలని తాపత్రయపడ్డ లారెన్స్‌ను మళ్లీ కలవలేకపోయావా? అంటే.. భయంగా ఉందని గుటకలు మింగాడు. స్కూలు నుంచి ఎందుకు పారిపోయావని తిడతాడేమో.. కొడతాడేమోనని వెనకడుగు వేసినట్లు తెలిపాడు. ఎలాగోలా ఈ విషయం లారెన్స్‌కు తెలిసింది. నిన్ను తిట్టను, కొట్టను.. ఒక్కసారి వచ్చి కలువురా అని ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టాడు. 

రూ.50 వేల ఆర్థిక సాయం
దీంతో ధైర్యం తెచ్చుకుని రవి రాథోడ్‌ ఎన్నో ఏండ్ల తర్వాత చెన్నైలో ఉన్న లారెన్స్‌ (Raghava Lawrence) ముందుకు వెళ్లాడు. అతడి పరిస్థితి చూసి చలించిపోయిన లారెన్స్‌ రూ.50 వేలు ఆర్థిక సాయం చేశాడు. లారెన్స్‌ ఇంకా ఏమన్నాడు? అనే విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రవి రాథోడ్‌. అతడు మాట్లాడుతూ.. ఆల్కహాల్‌ అడిక్షన్‌ తగ్గేందుకు నాకు అన్ని టెస్టులు చేయించారు. మెడిసిన్స్‌ ఇచ్చారు. అయితే మాస్టర్‌ ఫస్ట్‌ నన్ను చూడగానే ఓ మాటన్నారు.

ఆ డబ్బుతోనే ఫోన్‌ కొనుక్కున్నా
తాగేవాళ్లకు నేను సపోర్ట్‌ చేయను. ఏదో నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసని సపోర్ట్‌ చేస్తున్నానంతే! అన్నారు. నన్ను చెన్నైలోనే ఉండమన్నారు. కానీ, నాతో పాటు ఫ్రెండ్స్‌ వచ్చారని హైదరాబాద్‌కు వచ్చేశాను. మాస్టర్‌ డబ్బు సాయం కూడా చేశారు. ఆ డబ్బుతోనే మొబైల్‌ ఫోన్‌ కొనుక్కున్నాను. చెన్నై నుంచి వచ్చాక నేను తాగుడు మానేశాను. మెడిసిన్‌ వాడినప్పుడు మందు తాగితే చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్‌ హెచ్చరించాడు. అందుకే దాని జోలికి వెళ్లడం లేదు. 

జీవితంలో దాని జోలికి వెళ్లనని ఒట్టు
కాకపోతే నా కాలి నొప్పి ఇంకా సెట్టవలేదు. ఏదైనా సపోర్ట్‌ ఉంటే నడవగలుగుతున్నా అని చెప్పుకొచ్చాడు. రవి రాథోడ్‌ వెంట చెన్నై వెళ్లిన స్నేహితుడు మాట్లాడుతూ.. రాథోడ్‌కు టెస్టులు చేస్తే కిడ్నీలో రాళ్లున్నాయని చెప్పారు. దానివల్ల కాళ్లపై ఎఫెక్ట్‌ పడి సరిగా నడవలేకపోతున్నాడు. అయితే జీవితంలో మళ్లీ తాగనని లారెన్స్‌ అన్నకు మాటిచ్చాడు అని తెలిపాడు. మరి రాథోడ్‌.. ఆ మాటపై నిలబడి కొత్త జీవితం ప్రారంభిస్తాడేమో చూడాలి!

చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్‌.. ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అంతలోనే..

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)