'ఛావా'తో భారీ పాపులారిటీ.. ఏకంగా రెహమాన్‌తో కలిసి.. ఎవరీ వైశాలి?

Published on Thu, 02/20/2025 - 13:35

బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతున్న చిత్రం 'ఛావా(Chhaava)'. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా  ఫిబ్రవరి 14వ తేదీన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ మూవీ రూ.200 కోట్ల మార్క్‌ను దాటేందుకు సిద్ధమైంది.

ఛావా కోసం కష్టపడ్డ హీరో
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ఈ చిత్రాన్ని రూపొందించాడు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్నా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ కత్తి సాము నేర్చుకోవడమే కాకుండా 100 కిలోల బరువు పెరిగి మరీ సాహసం చేశాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి విడుదలైన "ఆయా రే తూఫాన్" పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

పాట పాడిందెవరో తెలుసా?
ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటను పాడింది ఎవరో కాదు మరాఠీ సింగర్ వైశాలి సామంత్ (Vaishali Samant). ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఆమె ఆయా రే తుఫాన్ సాంగ్‌తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించడంతో పాటు ఈ పాటను ఆలపించాడు. ఇర్షాధ్ కమిల్, క్షతిజ్ పట్వర్దన్ రచించారు.

మిలియన్ల వ్యూస్‌
ఈ పాట విన్న ఆడియన్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 37 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇదే విషయంపై వైశాలి మాట్లాడుతూ.."ఏ ఆర్ రెహమాన్ తో పాడే అవకాశం వచ్చినందుకు ఎప్పటికీ నేను కృతజ్ఞురాలినై ఉంటాను. ఛావా సినిమాలోని ఈ పాట నా సంగీత ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనది. ఆయన నా గానం పై నమ్మకం ఉంచి నాకు అవకాశాన్ని కల్పించారు. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆడియో లాంచ్ సందర్భంగా ఏఆర్ రెహమాన్‌తో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఒక గొప్ప అవకాశం. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని తెలిపింది.

 

చదవండి: కడుపుతో ఉన్న భార్య కోసం ఆరాటం.. జైల్లో ఉండగా నటుడు ఏం చేశాడంటే?

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)