దేశభక్తి టచ్ చేస్తే చాలు.. కాసుల పంట పండాల్సిందే!

Published on Tue, 01/27/2026 - 19:43

బాలీవుడ్ ఒకప్పుడు లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 'నేషనలిజం' ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. వెండితెరపై త్రివర్ణ పతాకం కనిపిస్తే చాలు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. 'ఉరి', 'గదర్ 2' నుంచి మొదలైన ఈ ఊపు, ఇప్పుడు 'ధురంధర్', 'బోర్డర్ 2' వరకు కొనసాగుతోంది. సామాన్యుడిలో ఉండే దేశభక్తిని భావోద్వేగంతో కలిపి వెండితెరపై చూపించిన ప్రతిసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన  దేశభక్తి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే రూ.450 కోట్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద విక్కీ కౌశల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. చారిత్రక వీరగాథలకు దేశభక్తి తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది.

రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన  'ధురంధర్' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఒక స్పై థ్రిల్లర్‌గా వచ్చి, దేశభక్తిని అద్భుతంగా పండించిన ఈ చిత్రం కేవలం ఏడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,285 కోట్లకు పైగా వసూలు చేసి 'ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్'గా నిలిచింది.

ఇక గతవారం (జనవరి 23) రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన 'బోర్డర్ 2' ప్రస్తుతం థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. 1971 ఇండియా-పాక్ యుద్ధం ఆధారంగా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల మార్కును చేరుకుంది. నిన్న ఒక్క రోజులోనే  ఇండియాలో ఈ చిత్రం రూ.59 కోట్లు రాబట్టిందని  నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇలానే కొనసాగితే ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. .సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ దేశభక్తి చిత్రానికి  అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. 1971 ఇండో - పాక్‌ యుద్ధం నేపథ్యంలో జేపీ దత్తా తెరకెక్కించిన బోర్డర్‌(1997) చిత్రానికి సీక్వెల్‌ ఇది. 
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)