Breaking News

నేనే దర్శకత్వం వహించినా.. ఇంత బాగా తీసేవాడిని కాదు : సాయి రాజేష్‌

Published on Sun, 07/26/2026 - 09:03

‘‘చెన్నై లవ్‌ స్టోరీ’కి నేను కథా రచయితను అయినా నాకంటే ఎక్కువగా ఈ కథను ప్రేమించి, అర్థం చేసుకుని సినిమా తీశారు రవి నంబూరి. నేను దర్శకుడిని అయినా ఇంత బాగా తెరకెక్కించేవాడిని కాదేమో. ‘బేబి’ తర్వాత మా గౌరవాన్ని పెంచే సినిమా చేయాలనుకున్నాం. ‘బేబి’ కన్నా ‘చెన్నై లవ్‌ స్టోరీ’ చాలా గొప్ప సినిమా’’ అని సాయి రాజేష్‌ తెలిపారు. కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్‌ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేష్, ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. 

శనివారం జరిగిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌లో రవి నంబూరి మాట్లాడుతూ– ‘‘మొదటి సినిమా బ్లాక్‌ బస్టర్‌ కావడం ఏ దర్శకుడికైనా ఓ కల. ఆ కల నిజం కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.

శ్రీ గౌరీప్రియ మాట్లాడుతూ– ‘‘కొంచెం ఎమోషనల్‌గా ఉన్నాను. నాకు చాలా ముఖ్యమైన రోజు ఇది. మా అమ్మ ఉండి ఉంటే నిజంగా చాలా సంతోషపడేవారు. కానీ, మా అమ్మ రూపంలో విశాల, ప్రమోదినిగార్లు అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెబుతుంటారు. ఇక్కడికి రాగానే ‘చెన్నై లవ్‌ స్టోరీ’లో నువ్వు చేసిన నివి పాత్రకు నీకు మంచి పేరు, ప్రశంసలు వస్తున్నాయి... అమ్మ చూసుంటే చాలా బాగుండేది’’ అని వారు అన్నారు. కానీ, మా అమ్మ చూస్తోంది.. తన వల్లే నాకీ పేరు వస్తోందని నా ఫీలింగ్‌’’ అన్నారు.  

 ‘‘అప్పట్లో బాలచందర్, భారతీరాజాగారి కథల్లా సాయి రాజేష్‌గారి కథల్లో లోతు ఉంటుంది. మా సినిమా తొలి రోజు రూ. 12.3 కోట్లు వసూలు చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని ఎస్‌కేఎన్‌ పేర్కొన్నారు. ‘‘నా కెరీర్‌లో స్టీవెన్‌ శంకర్‌ అనే గుర్తుండిపోయే పాత్ర ఇచ్చిన రవి నంబూరిగారికి థ్యాంక్స్‌’’ అన్నారు కిరణ్‌ అబ్బవరం. కెమెరామేన్‌ విశ్వాస్‌ డేనియల్, రచయిత అనంత శ్రీరామ్, నటీనటులు ప్రమోదిని, త్రిగుణ్, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)