Breaking News

రిలీజ్ రోజే కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?

Published on Fri, 07/24/2026 - 14:52

కిరణ్ అబ్బవరం, గౌరిప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా థియేటర్లలోకి వచ్చింది. ప్రేమకథగా తీసిన ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్లే కొన్నిచోట్ల పాజిటివ్ టాక్ మరికొన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఒకటి రెండు రోజులు ఆగితే అసలు ఫలితం ఏంటనేది తేలుతుంది. ఇదంతా పక్కనబెడితే రిలీజైన రోజే మూవీ టీమ్, కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయడం ఇక్కడ విచిత్రంగా అనిపించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)

'చెన్నై లవ్ స్టోరీ' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని కొన్నిచోట్ల గురువారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. కేవలం పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారానే రూ.3.13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే కిరణ్ అబ్బవరం స్టార్ హీరో కాదు, అలా అని టికెట్ రేట్లు కూడా పెంచలేదు. ప్రీమియర్లు కూడా గురువారం రాత్రి ఒకటి రెండు షోలు వేశారు. అంతమాత్రానికే రూ.3 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయా అనేది ఇక్కడ ప్రశ్న.

టాలీవుడ్‌లో ఒకప్పుడు కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తే జనాలు కూడా అదే నిజమని నమ్మేసేవాళ్లు. కానీ తర్వాత రోజుల్లో దిల్ రాజు, నాగవంశీ లాంటి ప్రముఖ నిర్మాతలే.. ప్రేక్షకులని ఆకట్టుకోవడం కోసం కొంత మొత్తం పెంచేసి నంబర్లు వేస్తుంటామని బాహాటంగానే ఒప్పుకొన్నారు. దీంతో ఆడియెన్స్ కూడా వసూళ్ల పోస్టర్ రిలీజ్ కాగానే ఇది నిజమా కాదా అని కనిపెట్టేస్తున్నారు.

'చెన్నై లవ్ స్టోరీ' విషయానికొస్తే.. నివి(గౌరీప్రియ) తన ప్రియుడు అజయ్‌(త్రిగుణ్‌)తో పెళ్లికి రెడీ అవుతుంది. కానీ ముహూర్తం టైంకి మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి, అజయ్ వెళ్లిపోతాడు. దీంతో హీరోయిన్ చెన్నై వెళ్లిపోతుంది. దేవదాసులా మందుకు బానిసవుతుంది. ఆ టైంలో స్టీవెన్‌ శంకర్‌ (కిరణ్‌ అబ్బవరం) ఈమెకు పరిచయమవుతాడు. దర్శకుడు అవ్వాలనే ఆశతో చెన్నైలోకి అడుగు పెట్టిన ఇతడికి నివి ఫ్రెండ్స్‌ గ్యాంగే ఆశ్రయమిస్తారు.

తొలుత స్టీవెన్, నివికి చిరాకు తెప్పించినా తర్వాత అతడికి దగ్గరవుతుంది. మళ్లీ ఈమెలో ప్రేమ చిగురిస్తుంది. తర్వాత వాళ్లిద్దరి ప్రయాణం ఎలా సాగింది? వీళ్ల ప్రేమకథలో ఎదురైన సవాళ్లేంటి? మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి పెళ్లి పీటలపై నివిని వదిలేసి వెళ్లిపోయిన అజయ్‌.. మళ్లీ ఆమె జీవితంలోకి ఎందుకొచ్చాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ)

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)