స్టార్‌ హీరో సినిమా వేడుక.. మలేషియాకు ఫ్యాన్స్‌ క్యూ

Published on Fri, 12/26/2025 - 10:26

చెన్నై ఎయిర్‌పోర్ట్‌ కిటకటిలాడుతుంది. మలేషియాకు వెళ్లే విమానాలు ఫుల్‌ అయిపోయాయి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? విజయ్‌ 'జన నాయగన్‌' కోసం. తమిళ టాప్‌ హీరో విజయ్‌ నటించిన ఈ మూవీ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో  కౌలాలంపూర్‌లోని బుకిట్‌ జలీల్‌ స్టేడియం (Bukit Jalil Stadium)లో డిసెంబరు 27న  జన నాయగన్‌ మూవీ వేడుక నిర్వహించనున్నారు. దీంతో తమిళనాడు నుంచి ఆయన ఫ్యాన్స్‌ భారీగా మలేషియాకు ప్రయాణం అయ్యారు. దీంతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్‌ కోసం భారీగా క్యూ కట్టేశారు.

మలేషియాలో తమిళ సినిమాలకు భారీగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ముఖ్యంగా విజయ్‌కు, విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆడియో వేడుకను అక్కడ నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకర్షించవచ్చని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. బుకిట్‌ జలీల్‌ స్టేడియం దక్షిణాసియాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటి. ఇందులో 90వేల  మందికి పైగా సీటింగ్‌ సామర్థ్యం ఉంది. 

ఈ కార్యక్రమంలో విజయ్‌తో పాటు చిత్ర యూనిట్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ పాల్గొననున్నారు. దీంతో ఇప్పటికే టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి.  ఈ వేడుకను పూర్తిగా సినిమా, సంగీతానికే పరిమితం చేయాలని మలేషియా పోలీసులు ఇప్పటికే స్పష్టమైన నియమాలు పెట్టారు. రాజకీయ ప్రసంగాలు, చిహ్నాలు అక్కడ కనిపించకూడదని నిషేధించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)