Breaking News

అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారు? భర్త ఆరోపణలపై నటి ఆవేదన

Published on Fri, 11/04/2022 - 13:39

మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌, నటి చారు అసోపాల విడాకులు వ్యవహరం రోజురోజుకు ముదురుతోంది. చీటింగ్‌ చేశాడని చారు, మోసం చేసిందని రాజీవ్‌ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజీవ్‌ తనని చిత్రహింసలు పెట్టాడని, తాను గర్భవతిగా ఉన్న సమయంలోనూ హింసించాడంటూ ఆమె వాపోయింది.  భార్య ఆరోపణలను ఖండిస్తూ రాజీవ్‌ సేన్‌.. ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన భార్య ‘యే రిషిత క్యా కెహలాతా హై’ ఫేం, నటుడు  కరణ్‌ మెహ్రాతో రొమాంటిక్‌ వీడియో చేసిందని, తప్పు చేసింది ఆమె అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. 

చదవండి: చీటింగ్‌ చేసి ప్రియాంక మిస్‌ వరల్డ్‌ అయ్యిందా?.. కో-కంటెస్టెంట్‌ సంచలన ఆరోపణలు

ఇక భర్త ఆరోపణలపై తాజాగా చారు అసోపా స్పందించింది. అంత తేలిగ్గా ఒక అమ్మాయి మీద లేనిపోని నిందలు ఎలా వేస్తారని? ప్రశ్నించింది. ‘రాజీవ్‌ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. అంత తేలిగ్గా నాపై లేనిపోని నిందలు వేస్తున్నాడు. నా గురించి చెప్పేందుకు ఏం లేదు. అందుకే రాజీవ్‌ నా మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఓ అమ్మాయిపై ఇలాంటి నిందలు వేయడం అంత తేలికా?.. నన్ను, నా క్యారెక్టర్‌ను తగ్గించేందుకే రాజీవ్‌ ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నాడు’ అని పేర్కొంది. 

చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌

అలాగే తన ఇన్‌స్టాగ్రామ్‌ చూపిస్తూ ఈ వీడియో రొమాంటిక్‌ కాదని, షూటింగ్‌లో భాగంగా కరణ్‌, నేను ఓ ఈవెంట్‌లో తీసిందని తెలిపింది. ‘నా మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తే పరాయి వ్యక్తితో ఉన్నది ఈ ఒక్క వీడియో మాత్రమే. అది కూడా రొమాంటిక్‌ వీడియో కాదు. వర్క్‌లో భాగంగా ఓ చానల్‌ వాళ్లు నన్ను, కరణ్‌ని ఇంటర్య్వూకి పిలిచారు. అప్పుడు కరణ్‌ నా పక్కనే ఉన్నాడు. ఆ చానల్‌ వాళ్లు అప్పుడు తీసిన వీడియో ఇది. పక్కనే మరికొందరు కూడా ఉన్నారు. ఇది రొమాంటిక్‌ వీడియో అయితే మేం ఇద్దరమే ఉండాలి కదా?’ అని చెప్పింది. గతంలో కూడా రాజీవ్‌ తనపై ఇలాంటి అరోపణలే చేశాడని, అప్పుడు డ్రైవర్‌తో ఇప్పుడు తన కో-స్టార్‌తో అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

Videos

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)