Breaking News

లైగర్‌ నష్టాలతో నిరవధిక దీక్ష.. స్పందించిన చార్మీ

Published on Sat, 05/13/2023 - 08:49

బాక్సాఫీస్‌ బద్ధలు కొడుతుందనుకున్న విజయ్‌ దేవరకొండ లైగర్‌ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై పూరీ జగన్నాథ్‌, చార్మీ, కరణ్‌ జోహార్‌ నిర్మించారు. గతేడాది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే నెగెటివ్‌ టాక్‌ మూటగట్టుకుంది. ఫలితంగా బాక్సాఫీస్‌ గండం గట్టెక్కలేకపోయింది.

ఈ సినిమా వల్ల ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌ ఎదుట రిలే నిరవధిక దీక్షకు పూనుకున్నారు. నష్టాన్ని భర్తీ చేస్తామని పూరీ జగన్నాథ్‌, డిస్ట్రిబ్యూటర్‌ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

తాజాగా ఈ ధర్నాపై నటి, నిర్మాత చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఫిలిం ఛాంబర్‌కు ఈ మెయిల్‌ ద్వారా సందేశాన్ని పంపింది. 

చదవండి: మోడ్రన్‌ లవ్‌ చెన్నై... ఆ ఓటీటీలో అప్పుడే స్ట్రీమింగ్‌!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)