Breaking News

భారత సంతతి సింగర్‌ను వరించిన గ్రామీ అవార్డ్‌

Published on Mon, 02/03/2025 - 11:06

ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గ్రామీ’ అవార్డును భారత సంతతికి చెందిన అమెరికన్‌ సింగర్‌, వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌ అందుకున్నారు. లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా 67వ గ్రామీ అవార్డ్స్‌ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన సింగర్స్‌తో పాటు సంగీత దర్శకులు పాల్గొని సందడి చేశారు. అయితే, చంద్రికా టాండన్‌(Chandrika Tandon)  రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్‌ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్ ఆర్‌ చాంట్ ఆల్బమ్‌గా అవార్డు దక్కించుకుంది. ఆమెకు గతంలో కూడా గ్రామీ అవార్డ్‌ వరించింది.

చెన్నైలో పెరిగిన చంద్రిక ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. పలు దేశాల్లో వ్యాపారవేత్తగా ఆమె రాణిస్తున్నారు. పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయీకి చంద్రిక సోదరి అవుతారని తెలిసిందే.  చెన్నైలోని  తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నతనం నుంచే సంగీతంపై ఎక్కువ మక్కువ చూపారు . ఆమె తల్లి సంగీత విద్వాంసురాలు కావడంతో శిక్షణ తీసుకోవడంలో చంద్రికా టాండన్‌కు మరింత సులువు అయింది. వ్యాపార రంగంలో రాణిస్తూనే సంగీత ప్రపంచంలో ఎందరినో మెప్పిస్తున్నారు. తాజాగా ఆమెకు మరోసారి గ్రామీ-2025 (Grammy Awards 2025) అవార్డ్‌ దక్కడంతో అభిమానులతో పాటు కుటంబ సభ్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)