Breaking News

'ఆదిపురుష్' కంటే 'చంద్రయాన్-3' బడ్జెట్ తక్కువ.. మీకు తెలుసా?

Published on Fri, 07/14/2023 - 16:13

Chandrayaan 3 Budget: సాధారణంగా రాకెట్ తయారీ అనగానే వేల కోట్లు ఖర్చు అనే మాట వినిపిస్తుంది. నాసా దగ్గర నుంచి ఇస్రో వరకు ఎవరైనా సరే ఈ విషయాన్ని ఒప్పుకొంటారు. కరెక్ట్‌గా చెప్పాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది తప్పితే తగ్గే సమస్య ఉండదు. తాజాగా ఇస్రో శాస్త్రవేత్తలు 'చంద్రయాన్ 3' ప్రయోగం చేశారు. ఇది జాబిలి దిశగా ప్రయాణించే కక్ష‍్యలోకి చేరింది. అయితే దీని బడ్జెట్, 'ఆదిపురుష్' బడ్జెట్ కంటే తక్కువనే టాక్ హాట్ టాపిక్‌గా మారింది.

(ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప‍్పుడే!)

ప్రయోగం సక్సెస్
బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం-3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్‌-3 ప్రయోగం.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. దీన్ని మన ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం-3 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 

బడ్జెట్ తక్కువే
సాధారణంగా ఉపగ్రహ ప్రయోగాలు వేల కోట్ల ఖర్చుతో కూడుకున్నదని అందరూ భావిస్తారు. ఇస్రో శాస్త్రవేత్తలు మాత్రం 'ఆదిపురుష్' సినిమాకు అయిన దాని కన్నా తక్కువ బడ్జెట్‌తోనే 'చంద్రయాన్ 3'ని రూపొందించారట. ప్రభాస్ సినిమా కోసం నిర్మాతలు దాదాపు రూ.700 కోట్ల వరకు పెడితే.. 'చంద్రయాన్ 3' కోసం కేవలం రూ.615 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలుస్తోంది. మేం చెప్పిన దానిపై నమ్మకం కుదరకపోతే గూగుల్ లో ఓసారి సెర్చ్ చేయండి. మీకే క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)