Breaking News

గ్లామర్‌ రోల్స్‌ రావడం లేదంటున్న 'కిరాక్‌' హీరోయిన్‌

Published on Mon, 04/15/2024 - 12:15

నటిగా నిలదొక్కుకోవాలంటే గ్లామర్‌ రూట్‌ ఎంచుకోక తప్పదని చాలా మంది కథానాయికలు భావిస్తున్నారు. ఇప్పుడు టాప్‌ హీరోయిన్లగా రాణిస్తున్న వారంతా గ్లామరస్‌గా నటించిన వారే అని చెప్పక తప్పదు. తాజాగా నటి చాందిని తమిళరసన్‌ కూడా గ్లామర్‌నే కోరుకుంటోంది. 2010లో శాంతనుకు జంటగా సిద్ధూ ప్లస్‌–2 చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైంది చాందిని. ఆ తరువాత విల్‌ అన్భు, నైయప్పుడై, కవన్‌, మన్నన్‌ వగైయారా, బిల్లా పాండీ, వంజకర్‌ ఉలగం వంటి చిత్రాల్లో నటించింది.

14 ఏళ్ల జర్నీ..
కథానాయికగా 14 సంవత్సరాలు పూర్తిచేసుకున్నా.. ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ స్థాయి కోసం పోరాడుతూనే ఉంది. మంచి అవకాశాలు రాకపోవడంతో వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కథ వింటున్నప్పుడే అందులోని పాత్రలోకి మారిపోతానన్నారు. తనకు అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఆశగా ఉందన్నారు.

అలాంటి ఛాన్సులు రావట్లే
రొమాన్స్‌తో కూడిన కామెడీ కథల్లో నటించాలన్నది ఆశ అని, అయితే అలాంటి అవకాశాలు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా గ్లామరస్‌ పాత్రలూ రావడం లేదని చెప్పింది. కుటుంబకథా చిత్రాల నటిగా కాకుండా, కాస్త గ్లామరస్‌తో కూడిన పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఒక వెబ్‌ సీరీస్‌లో నటిస్తున్నానని చాందినీ చెప్పింది.

చదవండి: కిడ్నాప్‌ కేసులో 'మైత్రీ మూవీ మేకర్స్‌' అధినేత నవీన్‌ యర్నేని

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)