Breaking News

'ఛాంపియన్' మరో సాంగ్.. ఈ బాలనటిని గుర్తుపట్టారా?

Published on Sun, 12/21/2025 - 17:53

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ వీకెండ్ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్, పాటలతో బజ్ తీసుకొచ్చే కాస్త బజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మూవీలోని ఐ యామ్ ఛాంపియన్ అంటూ సాగే టైటిల్ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో ఒకప్పటి టాలీవుడ్ బాలనటి కనిపించడం విశేషం. మరి ఈమెని గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?)

ఛాంపియన్ మూవీలో రోషన్‌తో పాటు ఓ పాటలో కనిపించిన ఈ బాలనటి పేరు అవంతిక వందనపు. తెలుగు మూలాలున్నప్పటికీ అమెరికాలో పుట్టి పెరిగింది. మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైంది. తర్వాత తెలుగులో ప్రేమమ్, ఆక్సిజన్, బాలకృష్ణుడు, మనమంతా, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో బాలనటిగా చేసింది. తర్వాత ఇంగ్లీష్‌లోనూ పలు సినిమాలు, సిరీస్‌లు చేసింది. మళ్లీ ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత తెలుగులో 'ఛాంపియన్'లోని స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.

వైజయంతీ మూవీస్ నిర్మించిన 'ఛాంపియన్' చిత్రంతో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వాతంత్ర‍్య బ్యాక్ డ్రాప్‌లోని పీరియాడికల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. రోషన్ గతంలో 'పెళ్లి సందD'లో హీరోగా నటించాడు. అది అంతంత మాత్రంగానే ఆడింది. ఇదొచ్చిన మూడేళ్లకు ఇప్పుడు 'ఛాంపియన్' అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)