పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం
Breaking News
'ఛాంపియన్' కలెక్షన్స్.. జోష్ పెంచిన రోషన్
Published on Sun, 12/28/2025 - 14:39
క్రిస్మస్ కానుకగా విడుదలైన ఛాంపియన్ సక్సెస్బాటలో నడుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకాంత్ తనయుడు రోషన్.. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్లో తన నటనతో రోషన్ మంచి మార్కులు అందుకున్నారు. దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ మూవీని భారీ బడ్జెట్తో ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ నిర్మించారు. ఇందులో రోషన్ సరసన అనస్వర రాజన్, సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది తదితరులు నటించారు.
కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ‘ఛాంపియన్’’ అంటూ రివ్యూలు రావడంతో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటిరోజు రూ. 4.50 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. మూడురోజుల్లో రూ. 8.89 కోట్లు రాబట్టి క్రిస్మస్ విజేతగా దూసుకుపోతుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మహానటి, సీతారామం వంటి భారీ విజయాల తర్వాత స్వప్న దత్ నిర్మించిన ఛాంపియన్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, వారు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ పరంగా రాబట్టడం లేదు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ మూవీలో చూపించారు. హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దౌర్జన్యాలకు తెలంగాణలోని గ్రామాలు ఏ విధంగా వణికిపోయాయో ఇందులో చూపించారు.
Tags : 1