Breaking News

'మహావతార్‌ నరసింహ' సినిమాపై చాగంటి కోటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు

Published on Fri, 08/15/2025 - 17:01

ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తాజాగా 'మహావతార్‌ నరసింహ' చిత్రాన్ని చూశారు. ఎవరూ ఊహించని రీతిలో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ రాబడుతున్న ఈ యానిమేషన్‌ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. ఆధ్యాత్మికత మార్గంలో యావత్‌ ప్రపంచాన్నే నడిపించే  చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌తో పాటుగా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

పురాణాలకు చాలా దగ్గరగానే 'మహావతార్‌ నరసింహ' చిత్రం ఉందని చాగంటి అన్నారు. భక్త ప్రహ్లాద వంటి సినిమా ఇప్పటికీ ప్రజల మదిలో ఉండిపోయింది. మనుషులతో కాకుండా కేవలం బొమ్మలతో సినిమా తీసినా నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి సన్నివేషం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని సూచించారు.

శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా చాగంటి కోటేశ్వరరావుతో సినిమా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు. వారిద్దరూ కలిసి  'మహావతార్‌ నరసింహ' సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలిపిన వీడియోను గీతా ఆర్ట్స్‌ షోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

జులై 25న విడుదలైన  'మహావతార్‌ నరసింహ' చిత్రాన్ని కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, ఇప్పటి వరకు ఈ మూవీ సుమారు రూ. 230 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. శ్రీ మ‌హావిష్ణువు న‌ర‌సింహావ‌తారం ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా.. హోంబలే ఫిల్మ్స్‌తో కలిసి క్లీమ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)