Breaking News

వివాదంలో మరో వెబ్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌కి కేంద్రం సమన్లు!

Published on Mon, 09/02/2024 - 12:47

సినిమానో వెబ్ సిరీస్ అనేది చాలా జాగ్రత్తగా  తీయాలి. లేదంటే ఈ కాలంలో ఎక్కడిలేనన్నీ వివాదాలు చుట్టుముడతాయి. అదే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తే మరింత కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మాత్రం తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. గతంలో పలు సినిమాలు, సిరీస్‌లతో వ్యతిరేకత ఎదుర్కొంది. ఇప్పుడు 'ఐసీ 814: కాందహార్ హైజాక్' సిరీస్‌తో మరో వివాదానికి కేరాఫ్ అయింది.

1999లో భారతీయ విమానం హైజాక్ గురించి అంత త్వరగా జనాలు మర్చిపోలేదు. అదే స్టోరీని తీసుకుని తీసిన వెబ్ సిరీస్ 'ఐసీ 814: కాందహార్ హైజాక్'. విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, అరవింద స్వామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో వచ్చిన వాటిల్లో బెస్ట్ అని ప్రశంసిస్తున్నారు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?)

అయితే కాందహార్ హైజాక్ చేసింది పాకిస్థాన్‌కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులే. అప్పట్లోనే నిందితుల పేర్లు బయటకొచ్చాయి. ఇబ్రహీం అక్తర్, సన్నీ ఖాజీ, సాహిద్ సయ్యద్, మిస్త్రీ జహూర్, షకీర్ అని అప్పుడే వాళ్లు ఫొటోలు కూడా రిలీజ్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన సిరీస్‌లో మాత్రం పేర్లు మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్ అని వేరే పేర్లతో సంభోదించారు. ఇలా పనిగట్టుకుని ముస్లింలా పేర్లు మార్చి ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించడంపై సోషల్ మీడియాలో విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.

ఈ క్రమంలోనే భారతీయ ప్రసార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ.. నెట్‌ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది. పేర్లు మార్పుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరి ఈ విషయంలో సదరు ఓటీటీ సంస్థ ఏమని సమాధానమిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే గొడవలు)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)