Breaking News

బద్ధకస్తులైన దర్శకులకు ఇకపై కష్టమే

Published on Mon, 11/02/2026 - 11:53

టాలీవుడ్‌ని గత కొన్నేళ్లలో మీరు గమనిస్తే చాలామంది దర్శకులు త్వరగా సినిమాలు తీయలేకపోతున్నారు. అదేమంటే ఫెర్ఫెక్షన్, పాన్ ఇండియా అని కబుర్లు చెబుతున్నారు. పోనీ రిలీజ్ తర్వాత సదరు మూవీస్ బ్లాక్‌బస్టర్ అవుతున్నాయా అంటే ప్రేక్షకుల కంటే ట్రోలర్స్‌కే పనికొస్తున్నాయి. మరోవైపు టైంకి ప్రింట్ సిద్ధం కాకపోవడంతో సెన్సార్ దగ్గర కూడా సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డ్.. నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

సినిమా సర్టిఫికేషన్ విషయమై చివరి నిమిషంలో హడావుడి చేసే నిర్మాతలు, దర్శకులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కీలక సూచనలు జారీ చేసింది.  మూవీ విడుదల తేదీ దగ్గర పడిందని హడావుడి చేసినంత మాత్రాన సర్టిఫికేషన్ ప్రక్రియని వేగవంతం చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. అన్ని విధాలా పూర్తయిన చిత్రాలనే సర్టిఫికేషన్ కోసం సమర్పించాలని స్పష్టం చేసింది.

  • సర్టిఫికేషన్ కోసం సమర్పించే సినిమాలో ఫైనల్ గ్రాఫిక్స్, టైటిల్స్, క్రెడిట్స్, సబ్‌టైటిల్స్, డిస్‌క్లెయిమర్స్, సెన్సార్ సర్టిఫికెట్ స్లేట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సహా అన్ని అంశాలు పూర్తిగా ఉండాలి.

  • ఫైనల్ థియేట్రికల్ వెర్షన్‌లో అవసరమైన చోట క్లోజ్డ్ క్యాప్షన్స్, వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేక సబ్‌టైటిల్స్, ఆడియో డిస్క్రిప్షన్ వంటి సౌకర్యాలను చేర్చాలి.

  • దరఖాస్తులో పేర్కొన్న సినిమా టైటిల్‌తో పాటు ట్రైలర్లు, టీజర్లు, ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించే టైటిల్స్ కూడా దరఖాస్తు చేసినంత మాత్రాన అవి ఉంటాయనే గ్యారంటీ లేదు. సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా ఎగ్జామినింగ్ కమిటీ లేదా రివైజింగ్ కమిటీ సినిమా టైటిల్స్‌ని పరిశీలించి, అవసరమైతే మార్పులు సూచించొచ్చు.

  • గ్రాఫిక్స్, తాత్కాలిక సంగీతం, అసంపూర్తి ప్రింట్లు లాంటి అంశాలు లేకపోవడం తదితర కారణాలతో దరఖాస్తులని నిబంధనలకు విరుద్ధమైనవిగా పరిగణించే అవకాశం ఉంది. అవసరమైన పత్రాలు, ఇతర ఫార్మాలిటీలు పూర్తవకపోతే దరఖాస్తులను తిరిగి పంపించడం, తిరస్కరించడం లేదా ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశముంది.

  • సినిమా, ట్రైలర్ లేదా టీజర్ విడుదల తేదీ దగ్గరగా ఉందనే కారణంతో సర్టిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం కుదరదు. మూవీలో మార్పులు, సవరణలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు సెన్సార్ బోర్డ్ నిర్దేశించిన నిబంధనలు, గడువు ప్రకారమే కొనసాగుతాయి.

  • సినిమా విడుదలకు తగినంత ముందుగానే సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్మాతలు, దరఖాస్తుదారులకు సెన్సార్ బోర్డ్ సూచించింది. తద్వారా పరిశీలన, కమిటీ సమీక్ష, అవసరమైన మార్పులకు సరిపడా సమయం దొరుకుతుంది. సినిమాటోగ్రఫీ చట్టం 1952, సినిమాటోగ్రాఫీ రూల్స్ 2024తో పాటు ఇతర మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని బోర్డ్ స్పష్టం చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)