పదిహేనేళ్ల తర్వాత రీ ఎంట్రీ: సిస్టర్‌ నివేదితగా సెలీనా

Published on Sun, 07/05/2026 - 03:54

హీరోయిన్‌ సెలీనా జైట్లీ పదిహేనేళ్ల తర్వాత తిరిగి చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మంచు విష్ణు హీరోగా వి. సముద్ర దర్శకత్వం వహించిన ‘సూర్యం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సెలీనా జైట్లీ సుపరిచితురాలే. 2004 డిసెంబరు 2న ఆ మూవీ విడుదలైంది. ఆ చిత్రం తర్వాత ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు కానీ బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేశారు.

సెలీనా హీరోయిన్‌గా నటించిన చివరి చిత్రం ‘శ్రీమతి’. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ కన్నడ సినిమా 2011 జూలై 8న విడుదలైంది. అదే ఏడాది ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సెలీనా తాజాగా బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్‌ నివేదిత బయోపిక్‌లో ఆమె నటించనున్నారు. ఈ మూవీకి రామ్‌కమల్‌ ముఖర్జీ దర్శకుడు.

‘‘సిస్టర్‌ నివేదిత సేవల గురించి నా చిన్నతనంలో మా అమ్మ నుంచి తెలుసుకున్నాను. ఇప్పుడు ఆమె బయోపిక్‌లో కనిపించనుండటం మరపురాని అనుభవం. పదిహేనేళ్లు ఐరో పాలో గడిపిన నేను మళ్లీ మూలాలను వెతుక్కుంటూ మాతృదేశానికి తిరిగి వచ్చి, సనాతన ధర్మంతో అనుసంధానం కావడం హ్యాపీగా ఉంది’’ అని సెలీనా జైట్లీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... 1867లో ఐర్లాండ్‌లో జన్మించిన సిస్టర్‌ నివేదిత అసలు పేరు మార్గరెట్‌ నోబెల్‌. 1898లో వివేకానందుడి శిష్యరికాన్ని స్వీకరించి సిస్టర్‌ నివేదితగా పేరు మార్చుకున్నారు. 1911లో 43 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూశారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)